Edupayala Temple: మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు గేట్లు త్తడంతో మంజీర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది.గత 6 రోజులుగా ఏడుపాయల దుర్గామాత ఆలయం జలదిగ్బంధం లోనే ఉంది.ఆలయ పూజారులు రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు.ఆలయ పైకప్పు వరకు వరద పారుతుంది.అమ్మవారి పాదాలను తాకుతూ మంజీర ప్రవహిస్తుంది.
ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టు ఎడమ, కుడి, కాలువలు మహబూబ్ నహార్ ఫతే నహార్ కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. కాలువలు ప్రవహించే పరిసర గ్రామాల చెరువులు,కుంటలు నీటి తో జలకళ సంతరించుకుంది.ఆయాగ్రా మాలలోని చెరువులు అలుగులు పారి మత్తడి దుంకుతున్నాయి. రైతన్నను లు హర్షం వ్యక్తం చేస్తున్నారు .