Nalgonda District (imagecredit:swetcha)
Politics, లేటెస్ట్ న్యూస్

Nalgonda: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య

Nalgonda: రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(Integrated Residential Schools) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. అధికారులు, కన్సల్టెన్సీతో మంత్రుల నివాస సముదాయంలోని తన క్యాంపు కార్యాలయంలో నల్గొండ(Nalgonda) ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ, మినిస్టర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం పై సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనాలను మంత్రి పరిశీలించారు.

సుమారు 200 కోట్ల అంచనాతో..

నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 4న నల్గొండ(Nalgonda) యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ ఉంటుందని, అదే రోజు ఇటీవల నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 22 ఎకరాల్లో 5,36,194 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు 200 కోట్ల అంచనాతో అధునాతన హంగులతో రెసిడెన్షియల్ స్కూల్(Residential School) నిర్మాణం చేయనున్నామని వెల్లడించారు. అకాడమీ బిల్డింగ్స్, స్టాఫ్ బిల్డింగ్స్(Staff Buildings), ప్లే గ్రౌండ్(Play Ground), థియేటర్, విద్యార్థులకు స్కిల్ డెవల్మపెంట్(Skill Development) లాంటి బ్లాకులు ప్రత్యేకంగా ఉండనున్నాయన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ 18నెలల నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

Also Read: RS Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య

బీసీ(BC), ఎస్సీ(SC), ఎస్టీ(ST), మైనారిటీ పేద విద్యార్థులకు కార్పోరేట్ కు దీటుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను, వరల్డ్ క్లాస్ స్కిల్స్(World Class Skills) ను అందించే రెడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారి జీవన శైలిలో గణనీయమైన మార్పు వస్తుందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఈ రెసిడెన్షియల్ స్కూల్ వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ఆధికారులు ప్రత్యేక చొరవతో మనసు పెట్టి పనిచేయాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Patan Cheruvu constituency: తగ్గనున్న ఎంపీటీసీల స్థానాలు.. ప్రభుత్వం గెజిట్

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు