RS Praveen Kumar (imagecredit:twitter)
Politics

RS Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar: ఫోన్​ట్యాపింగ్ కేసులో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట మార్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తన ఫోన్​ను ట్యాప్ చేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన ఆయన సోమవారం సిట్ విచారణకు హాజరైన తరువాత మీడియాతో దీనికి పూర్తి విరుద్ధంగా మాట్లాడారు. బీఆర్ఎస్(BRS) పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్లు ట్యాప్(Phone Taping) చేయించ లేదని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సహచర మంత్రులతోపాటు తన ఫోన్​ను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.

బీఎస్పీ అభ్కర్థులను పోటీకి
ప్రవీణ్ కుమార్(Praveen Kumar) గతంలో బీఎస్పీ(BSP) రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న విషయం తెలిసిందే. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయటమే కాకుండా పలు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బీఎస్పీ(BSP) అభ్కర్థులను పోటీకి నిలబెట్టారు. ఆ సమయంలో కేసీఆర్(KCR) తన ఫోన్ ను ట్యాప్ చేయిస్తున్నారంటూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తాను ఉపయోగిస్తున్న ఆపిల్ ఫోన్ నుంచి ఈ మేరకు మెసెజ్​వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో పంజగుట్ట పోలీసులు(Panjagutta Police) కేసులు నమోదు చేసి ఆయన వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్(BRS) తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇటీవల విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు.

Also Read: Double Bed House Scam: డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కుంభకోణంలో మరో కేసు

డార్క్ వెబ్ సైట్ లో
ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ అధికారికి వాంగ్మూలం ఇచ్చి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్(BRS) ఫోన్ ట్యాపింగ్ ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోలేదని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సహచర మంత్రులతోపాటు తన ఫోన్ ను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. డార్క్ వెబ్ సైట్(Dark Website) లో టూల్స్ ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తులతో ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు సిట్ అధికారులకు ఫిర్యాదు కూడా ఇచ్చానన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ను పావుగా వాడుకుంటోందని వ్యాఖ్యానించారు.

Also Read: Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా.. బండి హాట్ కామెంట్స్

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్