KTR: హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలనే బెదిరిస్తున్నారని, ఆయనకు పదవి ఇచ్చిందే ప్రజలు అన్నారు. తెలంగాణ భవన్ లో టీటీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ తోపాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయని, ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు. కానీ బెదిరిస్తారా? అని నిలదీశారు.
Also Read: KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆగ్రహం
.రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోగా అన్ని బంద్ చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారని చెమండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మ కర్త అంతే అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం
రియల్ ఎస్టేట్ నాశనం చేశారని, ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారని, హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఫైరయ్యారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా డ్రామా అంటున్న కాంగ్రెస్‌కు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్నారు. రహమత్ నగర్ డివిజన్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. శ్రీరామ్ నగర్ బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే..పక్కనే తెలంగాణ భవన్ అనే జనతా గ్యారేజ్ ఉంది.. మేం వచ్చి వారి సంగతి తేలుస్తాం అని స్పష్టం చేశారు. ఇప్పుడే ఒక సర్వే వచ్చింది.. మన గెలుపు భారీగా ఉండబోతున్నట్లు ఆ సర్వేలో తేలిందన్నారు.
కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు
జూబ్లీహిల్స్‌లో 4 లక్షల మంది ఓటేస్తే 4 కోట్ల మందికి మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బకొడితేనే వాళ్లు మనకు ఇచ్చిన హామీలు అమలవుతాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ నెంబర్ వన్ అయితే.. ఇప్పుడు లాస్ట్ ప్లేస్‌కు చేరుకుందన్నారు. కరోనా టైమ్‌లో ఇన్ కమ్ లేకపోయినా ఒక్క పథకాన్ని కూడా కేసీఆర్ బంద్ పెట్టలేదన్నారు. కరోనా టైమ్ కూడా లింక్ రోడ్లు వేసి అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ టైమ్‌లో కరెంటు కష్టాలు తీరితే.. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయ్యాయన్నారు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తారన్నారు. బ్యాలెట్ పై నుంచి మూడో నెంబర్ ఉన్నది కారు గుర్తుఅని, తీన్ నెంబర్ కారు.. మిగితావి బేకార్ అని స్పష్టం చేశారు.
Also Read: KTR: రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా పాలిస్తోంది.. పోలీసులు ఏం పీకుతున్నారు.. కేటీఆర్ వైల్డ్ ఫైర్!
