KTR (Image Source: Twitter)
తెలంగాణ

KTR: రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా పాలిస్తోంది.. పోలీసులు ఏం పీకుతున్నారు.. కేటీఆర్ వైల్డ్ ఫైర్!

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల నిర్వాకం వల్ల తెలుగు వారు సిగ్గు పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల గొడవలు తారా స్థాయికి చేరాయన్న కేటీఆర్.. వీటి కారణంగా ఐఏఎస్ అధికారులు బలి పశువులు అవుతున్నారని ఆరోపించారు. సీఎం అల్లుడు, మంత్రి కుమారుడు మధ్య ఐఏఎస్ అధికారి రిజ్వీ నలిగిపోయారని కేటీఆర్ అన్నారు. అందుకే రిజ్వీ.. వీఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోయారని ఆరోపించారు.

అధికారులూ.. తస్మాత్ జాగ్రత్త

తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మద్యం టెండర్లు రేవంత్ రెడ్డి అల్లుడికి వచ్చింది. ఓ మంత్రి కుమారుడికి రాలేదు. అందుకే ఐఏఎస్ అధికారి రిజ్వీ పైన మంత్రి ఒత్తిడి చేశాడు. తట్టుకోలేక వీఆర్ఎస్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా నడిపిస్తోంది. ముఠాకు నాయకత్వం రేవంత్ రెడ్డి వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు వత్తాసు పలికే అధికారులు తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు.

‘సీఎం ఇల్లు.. సెటిల్మెంట్స్‌కు అడ్డా’

మరోవైపు రాష్ట్రంలో సీఎం రూ.వేల కోట్లు సంపాదిస్తుంటే.. మంత్రులు వందల కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘మా ఇంటి మీదకు పోలీసులను పంపించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని స్వయంగా మంత్రి కుమార్తెనే చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే జూబ్లీ హిల్స్ ఇల్లు సెటిల్ మెంట్లకు అడ్డాగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బీఆర్ఎస్ నాయకుల పైన పోలీసులు కేసులు పెడుతున్నారు. పారిశ్రామిక వేత్తలను తుపాకీతో బెదిరిస్తే కేసు ఎందుకు పెట్టలేదు. పోలీసులు ఏం పీకుతున్నారు’ అని ఘాటుగా కేటీఆర్ విమర్శించారు.

‘ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు’

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి మంచి ఆఫీసర్ గా పేరు ఉందని కేటీఆర్ అన్నారు. అలాంటి వ్యక్తి తుపాకీతో బెదిరించిన వారిని ఎందుకు జైల్లో వేయడం లేదని నిలదీశారు. ‘డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ హుజూర్ నగర్ లో ఉంది. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించారని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పాడని అంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ ఎందుకు విచారణ చెయ్యడం లేదు. రోహిన్ రెడ్డి, సుమంత్ పైన ఎందుకు కేసు నమోదు కాలేదు. వ్యవస్థ మొత్తం అవినీతితో కంపు కొడుతోంది. నా రాజకీయ జీవితంలో మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లింది నేను చూడలేదు’ అని కేటీఆర్ అన్నారు.

Also Read: Ponnam Prabhakar: గురుకులాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక!

ఇండస్ట్రీకి షాడో మంత్రి

సినిమా ఇండస్ట్రీ మొత్తం రోహిన్ రెడ్డే చూస్తున్నట్లు తెలిసిందని కేటీఆర్ అన్నారు. అతడు షాడో సినిమా మంత్రి అని ఆరోపించారు. ఇదంతా చూస్తూ సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ అమ్ముడుపోయిందని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ‘శంకర్ విలాస్ లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసు. సర్వే నంబర్ 83 లో రేవంత్ రెడ్డి చేసేది అంత తెలుసు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. అన్ని బయటపెడతాం. ఎవరినీ వదిలేది లేదు’ అని కేటీఆర్ హెచ్చరించారు.

Also Read: Jubliee Hills Bypoll Survey: సంచలన సర్వే.. బెడిసికొట్టిన కాంగ్రెస్ – ఎంఐఎం వ్యూహం.. మైనార్టీల మద్దతు ఎవరికంటే!

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్