KTR Slams Congress: ప్రజలను పట్టించుకునే తీరిక కాంగ్రెస్
KTR Slams Congress ( image credit: swetcha reporter)
Political News

KTR Slams Congress: ప్రజలను పట్టించుకునే తీరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!

KTR Slams Congress: ప్రజల గురించి పట్టించుకునే తీరిక, ఉద్దేశ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అందుకే ఇచ్చిన అన్నీ హామీలను తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR )అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం తిరిగి సొంతపార్టీ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో రమేశ్ కు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన విజయం సాధించాలన్నారు.

కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలి

అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వెంట నిలబడతారని అశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అందరు కలిసి సమిష్టిగా ఎన్నికల్లో పోరాడాలని పిలుపు నిచ్చారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండాకు, కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ కు పరిపాలన చేతకావడం లేదన్నారు. అందుకే గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ పరిపాలనను వదిలిపెట్టారని మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటి అమలును పూర్తిగా విస్మరించారని, హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పూర్తిగా అబద్ధాల మీద పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు.

Also ReadKavitha: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత!

అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టారా?

అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, కాగ్ ఏజెన్సీలు నామమాత్రపు అప్పు మాత్రమే ఉందని చెబుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించిందని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు నిర్మించామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రెండేళ్లలో తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టారా? అని ప్రశ్నించారు.

ఒక్క ప్రాజెక్టు నైనా నిర్మించారా?

ఆ అప్పును ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్క ప్రాజెక్టు నైనా నిర్మించారా? సంక్షేమంపై ఖర్చు చేశారా? అని నిలదీశారు. బీజేపీ–కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత ప్రజలంతా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. గతంలో పార్టీ నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకు వెళ్లి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని సూచించారు.

కేసీఆర్ అంటే నమ్మకం,భరోసా

మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ దిక్కే చూస్తుందన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం,భరోసా అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ప్రజలకు భద్రత లేదు భరోసా లేదన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. రైతు బంధు పడుతుందో లేదో చెప్పే దిక్కేలేదన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవదనీ ప్రజలకు అర్థమైందన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్ కు బహుమతి ఇవ్వాలని పిలుపు నిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, ఆడబిడ్డలకు బస్ ఫ్రీ అంటూనే..మగ వాళ్ళకి డబుల్ టికెట్ వసూల్ చేస్తున్నారని మండిపడ్డారు. కలిసి మెలిసి కృషి చేసి మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపు నిచ్చారు.

Also Read: Kasireddy Narayan Reddy: పేదల జీవనోపాధి కోసం పరికరాల పంపిణి అభినందనీయం. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?