Kasireddy Narayan Reddy: మన ప్రాంతంలో చాలా మంది పేదలకు సరియైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. అలాంటి పేదలకు మేము అండగా ఉన్నామని చేతన, ఉన్నతి అండ్ శిక్ష ఫౌండేషన్ల ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండల కేంద్రంలో చేతన, ఉన్నతి అండ్ శిక్ష ఫౌండేషన్ల సంయుక్తంగా పేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ట్రై సైకిల్ పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యతిధిగా హాజరైన ఎమ్మెల్యే ప్రసంగించారు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు పేదలకు ఉపాధి కల్పించాలని శ్రామిస్తుందన్నారు. కానీ పూర్తి స్థాయిలో పనిచేయడం కొంత కష్టంగా ఉంటుందని అన్నారు. ఆ లోటును స్వచ్చంద సంస్థలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తాయన్నారు.
Also Read: Sridhar Reddy: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలకు, చేతలకు పొంతన లేదు : బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి!
పార్టీల అతీతంగా పనిచేస్తాం
ఆ స్వచ్చంద సంస్థలు పార్టీల అతీతంగా పనిచేస్తాయని, ఆ కార్యక్రమాలకు నచ్చిన వాళ్ళను పిలుచుకోవడం వారి ఇష్టమన్నారు. మంచి కార్యక్రమాలను ప్రోత్సహించకాపోగా అడ్డుకోవడం భవ్యం కాదని ఎమ్మెల్యే హితువు పలికారు. చేతన ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాలల్లో పేదలకు గత 10యేండ్లుగా తోచినంత సహాయం చేస్తుందన్నారు. ఇప్పటి వరకు రూ.50కోట్ల విలువైన వస్తువులు పంపిణి చేసి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఇక నుంచి మా నియోజకవర్గంలోని పేద ప్రజలకు మీ సహాయం ఎప్పటికి ఉండాలని కోరుతున్నానని అన్నారు.
సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలి
మా ప్రాంతానికి చెందిన ఉన్నతి అండ్ శిక్ష ఫౌండేషన్ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు సేవ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్లోని మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన బుక్స్, పెన్లు పంపిణి చేస్తూ సమాజ సేవలో ముందున్నారని ఎమ్మెల్యే పొగిడారు. మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ ప్రతినిధులు రవి కుమార్, సీతారామయ్య, సురేష్, ఉన్నతి అండ్ శిక్ష ఫౌండేషన్ ప్రతినిధులు ఎర్ర సుధాకర్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, రఘుపతి, చంద్రకుమార్, చిలివేరు సురేష్, వివిధ రాజకీయ ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Indira Mahila Sakthi: కల్వకుర్తిలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు..

