KTR on NDSA (imagecredit:swetcha)
Politics

KTR on NDSA: కాళేశ్వరం‌కు ఒక నీతి.. పోలవరానికి మరో నీతా?

KTR on NDSA: జాతీయ హోదా ఇచ్చి మరీ సాక్షాత్తూ ఎన్డీఏ(NDA) ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ(NDSA) కు కనిపించడం లేదా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిలదీశారు. ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూళేశ్వరం అన్న కాంగ్రెస్(Congress)-బీజేపీ(BJP) నేతలకు ‘పోలవరంను.. కూలవరం’ అనే దమ్ము ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా ? అని నిలదీశారు.

ఎందుకు మౌనంగా ఉన్నారో

అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ(Medigadda) పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏ ను దించి బీఆర్ఎస్(BRS) పై బురజల్లిన బీజేపీ(BJP) నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ ను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే.. తెలంగాణ(Telangana)లో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్ కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే అని పేర్కొన్నారు.

Also Read: Bandi Sanjay: మార్వాడీలకు ఫుల్ సపోర్ట్ పలికిన కేంద్రమంత్రి బండి సంజయ్

తెలంగాణకు జీవనాడి

2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఊలుకూ లేదు, పలుకూ లేదు.. మరోసారి ఏపీ(AP)లో పోలవరం కాఫర్ డ్యామ్ గోదావరిపాలైనా, ఇటు తెలంగాణలో ఎస్.ఎల్.బీ.సీ.(SLBC) టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్.డీ.ఎస్.ఏ అడ్రస్ లేదని దుయ్యబట్టారు. పంజాబ్ నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన కేసీ(KCR)ఆర్ పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్-బీజేపీ పార్టీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తామన్నారు. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: CM Revanth Reddy: జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు మెట్రో.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్