CM Revanth Reddy: పారదర్శక విధానంలోనే ప్రజలకు మేలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. ఆయన క్రెడాయ్ హైదరాబాద్(Hyderabad) ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ అపోహలు, అనుమానాలను దాటుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలసీ, కన్‌స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్స్ లాంటివని చెప్పారు. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని అన్నారు.
Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు
మొదటి ప్రాధాన్యత లోకల్స్‌కే
నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు తావిస్తుందని తెలిపారు. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. రక్షణ కల్పించడమే కాదని, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు ఊతం ఇస్తే నష్టపోయేది రియల్ వ్యాపారులే అని వివరించారు. ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే తాము, ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని గుర్తుచేశారు. పెట్టుబడుల విషయంలో తమ మొదటి ప్రాధాన్యత లోకల్స్‌కే అని స్పష్టం చేశారు. తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని, రాష్ట్ర సంపదను కొల్లకొట్టి విదేశాలకు తరలించుకుపోవాలనే ఆలోచన లేదన్నారు.
జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో
సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొన్ని కొందరికి నచ్చని నిర్ణయాలు ఉండవచ్చన్నారు. కానీ ప్రభుత్వానికి ప్రజల కోణం మేరకు సహకరించాల్సి ఉంటుందని చెప్పారు. కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారని, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మించగా, హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారన్నారు. ఇక జైపాల్ రెడ్డి(Jaipal Reddy) చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చిందని తెలిపారు. తాము ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నట్లు వివరించారు.
సీఎం ఫైర్
పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదని, అలా జరిగి ఉంటే హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేదన్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నామన్నారు. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారని, మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అని, కేంద్రం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతారు అని సీఎం ఫైర్ అయ్యారు.
లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్
ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగ్లా ఇచ్చింది నెలకు 4 రోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే అని గుర్తు చేశారు. తాను దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని వెల్లడించారు. అది ఫాంహౌస్ లా దావత్ చేసుకోవడానికి కాదన్నారు. 26 వేల కోట్ల రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించానని, అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నానని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పారు. మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పారు.
రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇన్ఫ్రా స్రక్చర్ ఎలా అభివృద్ధి అవుతుంది అని ప్రశ్నించారు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. భూమి ఒక సెంటిమెంట్ అని, దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుందని సీఎం రేవంత్ వివరించారు.
Also ReadAuto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా