KTR on CM Revanth( image credit: twitter)
Politics

KTR on CM Revanth: సీఎం రేవంత్ పనైపోయింది.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

KTR on CM Revanth: కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చేశారని నా అనుమానం’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మేడిగడ్డ పిల్లర్ కు చిన్న పర్రె పడితే దాన్ని దాచి పెట్టి మొత్తం ప్రాజెక్టే కూలిందని కాంగ్రెస్, ఎన్.డీ.ఎస్.ఏ రిపోర్ట్ తో కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న బీజేపీని చూస్తుంటే ఈ అనుమానం ఇంకా బలపడుతుందన్నారు ఓవైపు కాళేశ్వరం కూలిందని అంటూనే ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

Also Read: Maoist Encounter: నంబాల ఎన్ కౌంటర్ పై.. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి!

ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంసిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం దాని మీద అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అందాల పోటీలు రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకు మధ్య జరుగుతున్నట్టు ఉన్నాయన్నారు. మిస్ వరల్డ్ బ్యానర్ల మీద రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు చూశా.. వారిలో ఎవరు మిస్ వరల్డ్ పోటీదారులో అర్థం కాలేదన్నారు.

పదవితోనూ అధికారంతోనో మనిషికి గౌరవం దక్కదు.. రాదని కష్టకాలంలో కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉన్నోడే నిజమైన నాయకుడు అవుతాడన్నారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉన్న ఓ నాయకుడు కాంగ్రెస్లోకి పోతామంటే ఆ పార్టీ వాళ్లు వద్దని ధర్నాలు చేశారని అయినా ఆ నాయకుడికి సిగ్గు రాలేదన్నారు. కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని పెద్దలు అంటారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరన్ రెడ్డిని చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుందన్నారు.

Also Read: Bhoodan Land Case: ఈడీ కేసును కొట్టేయలేం.. భూదాన్​ భూములపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

పోయినోళ్ళు పోనీ ఉన్న వాళ్ళతోనే పార్టీని బలోపేతం చేసుకుందాం.. నిర్మల్, ముధోల్, ఖానాపూర్లో తిరిగి గులాబీ జెండా రెపరెపలాడించాలని పిలుపు నిచ్చారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు హైదరాబాద్ నుంచి అబ్జర్వర్లను పంపుతామన్నారు. ఒక్క ఊరు.. ఒక్కో నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గెలిచాక పార్టీ నమ్ముకుని ఉండే వాళ్లకు టికెట్లు ఇస్తాం.. గెలిపించుకుందాం అన్నారు. రైతులయితే ప్రతి ఊర్లో బాధపడుతున్నారన్నారు.

100% రుణమాఫీ ఎక్కడ అయిందో చూపెట్టాలని అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సైలెంట్ గా ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదన్నారు. వానలు పడుతుంటే కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. ఊర్లో సర్పంచ్ లేడు.. ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు.. ఎమ్మెల్యే లేడు.. కాంగ్రెస్ నేతలందరూ సెక్రటేరియట్ చుట్టూ పైరవీలు కోసం తిరుగుతున్నారని విమర్శించారు.

Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్‌కు ఆ వ్యాధి ఉంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

17 నెలల కాలంలోనే కాంగ్రెస్ చేస్తున్న దోపిడీ బాగోతం తెలంగాణలోని ఊరూరికి చేరిందన్నారు. కేసీఆర్ ను దొర దొర అని తిట్టినవాళ్లే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దొంగ దొంగ అంటున్నారన్నారు. మంచి పనులు చేసిన తర్వాత కూడా కేసీఆర్ కి అనుకున్న ఫలితం రాలేదని, అందుకు పార్టీ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయన్నారు.లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమేఅన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెప్తున్న రేవంత్ రెడ్డి ముందుగా ఆడబిడ్డలకు ఇస్తానన్న నెలకు 2500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జూన్, జూలైలో పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ లను ఎండబెట్టి తెలంగాణకు గుండె ధైర్యం అయిన గులాబీ జెండాను మరొక్కసారి ఎగిరేయాలని పిలుపు నిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం ఉన్న మాట నిజమే కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పని చేయకుంటే అనుకున్న ఫలితాలు రావు అన్నారు. లొట్ట పీసు కేసులతోని అయ్యేది ఏమీ లేదు.. రేవంత్ రెడ్డి కథ ముగిసింది అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు పైసల సంపాదన మీద పడ్డాడని మండిపడ్డారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు