Maoist Encounter( Image credit: twitter)
తెలంగాణ

Maoist Encounter: నంబాల ఎన్ కౌంటర్ పై.. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి!

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్ కౌంటర్ లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు.

మీడియా ప్రకటన విడుదల చేశారు. నంబాల ఎన్ కౌంటర్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయని, ఈ వయసులో అడివిలో ఉన్నారా? లేదా తీసుకెళ్లి అక్కడ మట్టుపెట్టారా అనే కథనాలు వస్తున్నాయన్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న మావోయిస్టుల, ఆదివాసీల ఎన్ కౌంటర్ల పై కూడా విచారణలో చేర్చాలని, ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణ అంశంలో చేర్చాలని కోరారు.

Also Read: Balanagar Crime: సెలవుల్లో ఎంజాయ్​ చేద్దామని.. చిన్నారిపై అఘాయిత్యం!

ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమన్నారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా ఎన్ కౌంటర్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా చూడాలన్నారు.

2026 మార్చి 31 వరకు మావోయిస్టులను అంతమొందిస్తామని లక్ష్యంగా పెట్టుకుని మరీ ఎన్ కౌంటర్లు చేస్తుండడం, మరోపక్క తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. ఇది ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే అంశమన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని తెలిపారు.

Also Read: Bhoodan Land Case: ఈడీ కేసును కొట్టేయలేం.. భూదాన్​ భూములపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!