BRS Party; జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బావబామ్మర్దులకు సవాల్ గా మారింది. ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే నాదిపలకాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే గెలుపుతీరాలకు గులాబీ పార్టీని చేర్చుతారా? లేదా? అనేది ఆసక్తి నెలకొంది.
సత్తా చాటాలంటే గెలవాల్సిందే..
బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్థానం కావడంతో దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై ఉంది. ఆయనకు ఈ ఉప ఎన్నిక రాజకీయ భవిష్యత్ సైతం ఆధారపడి ఉంది. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తన సత్తాను చాటాలంటే గెలవాల్సిందే. అంతేకాదు లీడర్ గా ఆయనలోని రాజకీయ చతురతకు ఇది కీలకంగా మారనుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్ చార్జీలను నియమించారు. పోలింగ్ బూత్ ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు వార్ రూం ఏర్పాటు చేసి నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అంతేకాదు బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమం ముమ్మరం చేపట్టారు. ఒకవైపు బైక్ ర్యాలీలు సైతం చేపడుతున్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకోవాలని, ఓటురూపంలో మల్చుకొని విజయం సాధించాలని భావిస్తున్నారు. అయితే కేటీఆర్ రాజకీయ సత్తాకు ఇది కీలకం కానుంది. ఇప్పటికే డివిజన్ల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ మరోవైపు ఇతర పార్టీలకు చెందిన నేతలను గులాబీ గూటికి చేర్చుతున్నారు. అయితే ఇది ఏమేరకు కలిసి వస్తుందనేది సైతం ప్రచారంజరుగుతుంది.
Also Read: Sai Dharam Tej: అప్పుడు కోమాలోకి వెళ్లాను అని చెప్పలేదు.. చిల్ అవ్వడానికి వెళ్లా అని చెప్పేవాడిని..
హరీష్ రావు సత్తా చాటుతారా..
ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్ చార్జీగా పార్టీ నియమించింది. ప్రచార బాధ్యతలను సైతం చేపడుతున్నారు. ఇప్పటికే హరీష్ రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. అయితే ఏ మేరకు హరీష్ రావు తమ సత్తాను చాటుతారు.. ఆయనకు అప్పగించిన బాధ్యతను ఏ మేరకు సక్సెస్ చేస్తారు.. ఉప ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ అధినేత కేసీఆర్(KCR).. గట్టిపోటీ ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగిస్తారు. హరీష్ రావు గట్టెక్కిస్తాడనే ప్రచారం ఉంది. అయితే జూబ్లీహిల్స్ లో గులాబీ జెండాను రెపరెపలాడిస్తారా? చతికిలపడతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు ఎంఐఎం సైతం..
ఇది ఇలా ఉంటే హైదరాబాద్(Hyderabad) నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్(KCR) తిరిగి అధికారంలోకి రావాల్సిందే.. అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందే నని బీఆర్ఎస్(BRS) నేతలు పేర్కొంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో గత బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, మాగంటి గోపీనాధ్(Maganti Gopinath) పై ప్రజల్లోని ఆధరణ పై నమ్మకం పెట్టుకుంది. కాంగ్రెస్(Congress) పార్టీ వైఫల్యాలు కలిసి వస్తాయని ఆశిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, ప్రజలు సైతం ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఎంఐఎం(MIM) సైతం కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏ ప్రణాళికలతో బీఆర్ఎస్ ముందుకు సాగుతుంది.. ఓటర్లను ఎలా ఆకట్టుకుంటుంది.. విజయం ఎలా సాధిస్తుంది.. అనేది ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతుంది.
Also Read; Uttam Kumar Reddy: హరీష్ రావు పై రెచ్చిపోయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..?
సీనియర్ లీడర్లపై చిన్న చూపు..
మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంను బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. అయితే నియోజకవర్గంలోని సీనియర్ లీడర్లను కలుపుకొని పోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. కొంతమందికే ప్రియార్టీ ఇస్తున్నారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నవారికి మొండిచెయ్యి చూపుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా విజయం సాధిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం సమావేశాలు, ప్రచారంతో కాలం వెళ్లదీస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది మాత్రం ఆరా తీయడం లేదనే కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించి వారి పక్షాన నిలబడతామనే భరోసా ఇవ్వాలని, వారి మనసులను చూరగొన్నప్పుడే విజయం తధ్యమని పేర్కొంటున్నారు. అలా చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పనిచేస్తున్నవారికంటే చేరిక వారికే ప్రియార్టీ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన విధంగా బీఆర్ఎస్(BRS) పార్టీ చేరికలపై దృష్టిపెట్టింది. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలను చేర్చుకుంటున్నారు. ఇదే అప్పుడు పలు నియోజకవర్గాల్లో ఓటమికి దారితీసిందని పలువురు అప్పట్లోనే బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీలో ఎక్కువ మంది నేతలు కావడం, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికంటే చేరిక వారికే ప్రియార్టీ ఇచ్చారని, దీంతో నేతల మధ్య సమన్వయం లోపించడం ఓటమికి కారణమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిపై సైతం కొంత మంది నేతల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతుంది. దానిని పూర్తిస్థాయిలో పోగొట్టకుండా మళ్లీ చేరికలపై దృష్టిసారించడం ఏమిటనే పలువురు ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కుటుంబంపై సానుభూతి తో టికెట్ ఇచ్చి ఓటమికి పార్టీ అధిష్టానమే కారణమైందని ఆరోపణలు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మళ్లీ కుటుంబానికే ఇవ్వడంతో పార్టీని విజయతీరాలకు ఎలా చేర్చుతారనేది ఇప్పుడు ఆసక్తికర చర్చజరుగుతుంది. కేటీఆసీనియర్ లీడర్ర్, హరీష్ రావు(Harish Rao) సామర్థ్యానికి ఈ ఉప ఎన్నికల పరీక్షగా మారిందని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. పార్టీని గెలుపుతీరాలకు చేర్చి మరోమారు హైదరాబాద్ బీఆర్ఎస్ కు కంచుకోట అని రుజువు చేస్తారా? లేదా? అనేది చూడాలి.
Also Read; John Wesley: బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి: జాన్ వెస్లీ
