Kavitha: ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవితKavitha) ఈ నెల 3న రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)కి జాగృతి నేతలతో పంపించారు. రాజీనామాను ఆమోదించాలని కవిత ఫోన్‌లో మండలి ఛైర్మన్‌ను కోరారు. కవిత రాజీనామాపై ఛైర్మన్ వెంటనే నిర్ణయం తీసుకొని ఆమోదిస్తారని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ వారం రోజులుగా చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెండింగ్ లో పెట్టారు. అయితే ఈ నెల 11 నుంచి 14వరకు కర్నాటకలో జరిగే ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో మండలి ఛైర్మన్ పాల్గొంటున్నారు. తిరిగి వచ్చిన తర్వాతనే కవిత రాజీనామా ఆమోదంపై ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. రాజీనామా ఆమోదానికి ముందుకు ఎమ్మెల్సీ కవిత అభిప్రాయాన్ని మరోమారు కోరనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం.
Also Read Kavitha: సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయం.. కవిత కీలక వ్యాఖ్యలు
స్తానిక సంస్తల కోటాలో ఖాళీ
ఇది ఇలా ఉంటే కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం నుంచి 2020 అక్టోబర్ 12న బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి విజయం సాధించారు. ఆమె పదవికాలం 2028 జనవరి 4న ముగియనుంది. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కవిత రాజీనామాతో శాసనమండలి స్తానిక సంస్తల కోటాలో ఖాళీ ఏర్పడనుంది. అయితే చైర్మన్ ఆమోదిస్తే ఆ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. శాసన మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఓటర్లుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పోరేటర్ పదవులన్నీ ఖాళీగా ఉన్నాయి. నెలలు గడుస్తున్న ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మండలి స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఓటర్లు లేక పోవడంతో ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉన్నది.
824 మంది ఓటర్లు
మరోవైపు నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు కలుపుకుని 596, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు 215 మంది ఉన్నారు. ఎక్స్ అఫిషీయోలుగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలతో కలిసి మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. నిబంధనలమేరకు మండలి స్థానిక సంస్థల నియోజకవర్గంలో కనీసం 75శాతం మంది ఓటర్లు ఉంటే ఉప ఎన్నిక షెడ్యూలు జారీ చేయాలనే నిబంధన ఉంది.
జడ్పీటీసీ సంఖ్య 596
608 పదవులు భర్తీ అయితేనే మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నిక సాధ్యమవుతుంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీ సంఖ్య 596 మాత్రమే. ఈ నేపథ్యంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరిగితేనే శాసన మండలి నిజామాబాద్ స్థానిక సంస్థ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు మార్గం సుగమం కానున్నది. ఈ నేపథ్యంలో కవిత రాజీనామాను చైర్మన్ ఆమోదించినప్పటికీ ఎన్నిక మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉంటే కవిత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలో నిలుపుతుందనే ఆసక్తికర చర్చ సైతం పార్టీలో జరుగుతుంది. సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలంటే మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తుందా? కొత్తవారికి అవకాశం ఇస్తుందా? అనేది కూడా చర్చకు జరుగుతుంది. కవిత జాగృతి తరుపున బరిలో నిలిస్తే ఏం జరుగుతుంది? అసలు బరిలో నిలుస్తారా? దూరంగా ఉంటారా? ఏదైనా పార్టీకి మద్దతు తెలుపుతారా? అనేది సైతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా కవిత రాజీనామా పెండింగ్ తో ఆసక్తికర చర్చ అటు బీఆర్ఎస్ లో ఇటూ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి.. జై కొట్టిన కవిత
