Kalvakuntla Kavitha (Image Source: Twitter)
తెలంగాణ

Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి.. జై కొట్టిన కవిత

Kalvakuntla Kavitha: సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈ ప్రక్రియలో కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాము కూడా సామాజిక తెలంగాణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు.

‘మేధావులను కలుస్తా’
మంగళవారం కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. సామాజిక తెలంగాణ కోసం లెప్ట్ వింగ్, రైట్ వింగ్ నాయకులు, మేధావులను కలుస్తామన్నారు. సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకొని తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. మూడో సారి గెలిస్తే కేసీఆర్ గారు సామాజిక తెలంగాణ చేసే వారని కవిత అన్నారు. వారి అజెండాను జాగృతి ద్వారా ముందుకు తీసుకెళ్తామన్నారు.

కేసీఆర్‌కు షాక్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేసీఆర్ కు కవిత షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ మద్దతివ్వని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి కవిత మద్దతు పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డగా భావించాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఎంతో అవగాహన ఉన్నఆయన ఉపరాష్ట్రపతి గా ఎన్నికైతే…ఆ పదవికే వన్నె తెస్తారన్నారు. ఎన్నికల కమిషనర్ గా టీఎన్ శేషన్ గతంలో ఆ పదవికి ఎలా వన్నె తెచ్చారో…జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా పదవికి వన్నె తెస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నిస్తాం
మొన్నటి వరకు కాళేశ్వరం కూలిందన్న రేవంత్ రెడ్డి.. అదే ప్రాజెక్ట్ లోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు ఎలా తెస్తున్నారని కవిత ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ లో రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెస్తే రూ.1500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని గుర్తు చేశారు. కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ. 7500 కోట్లు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు రేవంత్ సహకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ము రేవంత్ ఇంటి సొమ్ము కాదన్నారు. ప్రాజెక్ట్ విలువ రూ. 7,500 కోట్లకు ఎందుకు చేరిందో చెప్పే వరకు ప్రశ్నిస్తామన్నారు.

Also Read: Indiramma indlu: ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు పక్కా.. మంత్రి హామీ

కాళోజీ, చాకలి ఐలమ్మ గురించి..
కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కవిత నివాళులు అర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగాను ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలను కదలించిన కవి కాళోజీ అని అన్నారు. పుట్టుక నీది, చావు నీది బతుకంతా తెలంగాణది అని ఆయన మనలో స్ఫూర్తి నింపారని అన్నారు. కవికి మరణం ఉండదని.. కాళోజీ అనుసరించిన విలువలు, కవిత్వం ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకునేలా చేస్తున్నాయన్నారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. అలాంటి వీరత్వం తెలంగాణ రక్తంలోనే ఉందని.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు కదలాలని సూచించారు.

Also Read: Nepal GenZ Protests: నేపాల్‌లో అల్లకల్లోలం.. రాష్ట్రపతి భవన్‌కు నిప్పు.. ప్రధాని ఇల్లు ధ్వంసం

Just In

01

Nithiin Srinu Vaitla Movie: టాలీవుడ్‌లో తెరపైకి మరో కాంబో.. ఫిక్స్ అయితే ఫ్యాన్స్‌కు పండగే..

Siachen Avalanche Tragedy: మంచుకొండ చరియలు విరిగిపడి ముగ్గురు సైనికులు కన్నుమూత

KTR: గ్రూప్-1 అవకతవకలపై.. జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Hydra: గ‌చ్చిబౌలిలో 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Akshay Kumar: అక్షయ్ కుమార్ ఎమోషనల్ పోస్ట్ .. ఎందుకంటే?