Kavitha: సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని, ఈ ప్రక్రియలో కేసీఆర్(KCR) ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుంటామని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సామాజిక తెలంగాణ కోసం లెప్ట్ వింగ్, రైట్ వింగ్ నాయకులు, మేధావులను కలుస్తామన్నారు. సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకొని తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు.
Also Read: Shocking Case: అడవిలో ఓ వివాహిత, ఆమె ఫ్రెండ్ మృతదేశాల గుర్తింపు.. కాల్ రికార్డ్స్ పరిశీలించగా..
కాంగ్రెస్ పార్టీ అవినీతి ని ప్రశ్నిస్తాం
మూడో సారి గెలిస్తే కేసీఆర్(KCR) సామాజిక తెలంగాణ చేసే వారన్నారు. వారి అజెండాను జాగృతి ద్వారా ముందుకు తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అవినీతి ని ప్రశ్నిస్తామన్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం కూలిందన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) అదే ప్రాజెక్ట్ లోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు ఎలా తెస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ లో . కాంగ్రెస్ పార్టీ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెస్తే 1500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని గుర్తు చేశారు. కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ.7500 కోట్లు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్ట్ విలువ రూ. 7500 కోట్లకు ఎందుకు?
మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ము కాంగ్రెస్ పార్టీ ఇంటి సొమ్ము కాదన్నారు. ప్రాజెక్ట్ విలువ రూ. 7500 కోట్లకు ఎందుకు చేరిందో చెప్పే వరకు ప్రశ్నిస్తామన్నారు. బీఆర్ఎస్ మద్దతివ్వని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి కవిత మద్దతు పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డగా భావించాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఎంతో అవగాహన ఉన్నఆయన ఉపరాష్ట్రపతి గా ఎన్నికైతేమ ఆ పదవికే వన్నె తెస్తారన్నారు.
తెలంగాణ ప్రజలను కదలించిన కవి కాళోజీ అన్నారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. అలాంటి వీరత్వం తెలంగాణ రక్తంలోనే ఉందని…చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో ముందుకు కదలాలని సూచించారు. సమావేశంలో ప్రముఖ కవులు, రచయితలు ఉషారాణి, డాక్టర్ కాంచనపల్లి, డాక్టర్ చమన్ సింగ్, లక్ష్మీ నారాయణ, తిరుమల శ్రీనివాస్ ఆర్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Raj Kundra Fraud: చీటింగ్ కేసులో రాజ్ కుంద్రాకు పోలీసులు సమన్లు.. అయినా అవేం పనులు