Kavitha: జాగృతి అంటేనే పోరాటాల జెండా జాగృతి అంటేనే విప్లవాల జెండా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. ఒక్కటి కాదు రెండు కాదు.. అన్ని అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన బీసీ నాయకుడు రామ్ కోటి తో పాటు 350 మందికి పైగా కార్యకర్తలు జాగృతిలో చేరారు. వారికి కండువాలు కప్పి జాగృతి లోకి కవిత ఆహ్వానించారు.
Also Read:Kavitha: గ్రూప్1 పరీక్షల్లో అక్రమాలు.. నిరుద్యోగులకు న్యాయం చేయాలి.. కవిత కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం ఆడబిడ్డలకు రూ.2500 నెలకు ఇస్తామంటూ మోసం
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుందన్నారు. పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూ.2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలని పిలుపు నిచ్చారు. ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది.
పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఎది
అడబిడ్డలకు కిట్ ల సాధన కోసం ప్రభుత్వం పై కొట్లాడాలని సూచించారు. పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదు. దాని కోసం మనం కొట్లాడాలి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇయ్యలేని పరిస్థితి దాని కోసం కొట్లాడాలన్నారు. బీసీ బిల్లు తెస్తామని తేనందుకు కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థిని చదువుకు కవిత హామీ
పేదింటి విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన శామీర్ పేట నరేంద్రాచారి, స్వప్న దంపతుల కుమార్తె ఆశ్రిత మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. నరేంద్రాచారి హఠాన్మరణంతో బిడ్డ చదువు కష్టంగా మారింది. కాలేజీ ఫీజు చెల్లించడం భారంగా మారింది. ఆశ్రిత పరిస్థితిని తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత ఫీజు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. భరోసా కల్పించారు. మొదటి సంవత్సరం ఫీజు మొత్తాన్ని ఆశ్రిత, ఆమె తల్లి స్వప్నకు అందజేశారు.
Alao Read: Kavitha: ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.. కవిత కీలక వ్యాఖ్యలు
