Kavitha: గ్రూప్1 పరీక్షల్లో అక్రమాలు.. నిరుద్యోగులకు న్యాయం
Kavitha ( IMAGE CREDIT SWETCHA REPORTER)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Kavitha: గ్రూప్1 పరీక్షల్లో అక్రమాలు.. నిరుద్యోగులకు న్యాయం చేయాలి.. కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణలో ఉన్న మేధావులు గ్రూప్ -1 పరీక్షలపై మౌనం వీడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గ్రూప్ 1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని ధర్నా నిర్వహించామన్నారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి టీజీపీఎస్సీ ముట్టడి చేసిన ప్రభుత్వంలో చలనంలేదన్నారు. కాంగ్రెస్ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ , బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు అన్నారు.

Also Read: Post Office Scheem: రోజుకు రూ.2 పెట్టుబడితో.. రూ.10 లక్షలు పొందే.. అద్భుతమైన పోస్టాఫీసు స్కీమ్!

గ్రూప్ 1 పరీక్ష పై హరగోపాల్ మాట్లాడాలి

రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని, వారినే మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చేయాలేదన్నారు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చామనిఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. గ్రూప్ 1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారన్నారు. పరీక్ష రద్దయ్యే వరకు ప్రభుత్వం మెడలు వుంచుతామన్నారు. గ్రూప్ 1 పరీక్ష పై హరగోపాల్ మాట్లాడాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులను మోసం

అవసరం అయితే నేను హరగోపాల్ ను కలుస్తానన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కులగొడుతారని స్పష్టం చేశారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి, తిరిగి మళ్లీ గ్రూప్ 1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తామని వెల్లడించారు.

 Also ReadKavitha: ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.. కవిత కీలక వ్యాఖ్యలు

Just In

01

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!