Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు ఇంకా కేవలం రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 21తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండటంతో సమర్పణకు సమయముంది. ఆ తర్వాత ఆది, సోమవారాలు దీపావళి పండుగ సెలవులు కావటంతో తిరిగి 21వ తేదీన మధ్యాహ్నాం మూడు గంటలకు నామినేషన్ల స్వీకరణకు తెర పడనుంది. గత నెల 30న జారీ అయిన ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విడుదల చేయటంతో అదే రోజు నుంచి నామినేషన్ల సమర్పణ మొదలైంది. ఫస్డ్ డే నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లను సమర్పిస్తున్నారు.
నామినేషన్ల స్వీకరణలో అయిదవ రోజైన కూడా 20 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్ పత్రాలను షెక్ పేటలోని తహశిల్దార్ ఆఫీసులో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలర నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ పి. సాయిరాంకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. శుక్రవారం నామినేషన్లు సమర్పించిన వారిలో ఇబ్రాహీంఖాన్, సయ్యద్ ముస్తాఫా హుస్సేన్ లు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇదివరకే ఒక సెట్ నామినేషన్ వేయగా మరో సెట్ వేశారు. మిగతా 18 మందిలో 13 మంది వివిధ పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఐదుగురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా నామినేషన్లు వేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ నామినేషన్ వేయగా, మిగతా పార్టీల నుంచి ఆయా క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ గడువు ముసిగే కల్లా మొత్తం 63 మంది అభ్యర్థులు, 79 సెట్ల నామినేషన్లు సమర్పించారు.
అన్ని వర్గాలను కలుపుకుని పోవాలే: ఎంపీ అసద్
అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసినానంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ ను ఆలింగనం చేసుకున్న ఎంపీ నువ్వు గెలవాలి, అభివృద్ది జరగాలని, అందుకోసం అన్ని వర్గాలను కలుపుకుని పోవాలని సూచించారు. గడిచిన పదేళ్లలో జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభివృద్ది జరగలేదని, అంతా ఆగమాగమైందని, ఇపుడు నీలాంటి ప్రజాప్రతినిధి ఇక్కడ అవసరమని ఎంపీ వ్యాఖ్యానించారు. నవీన్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయనతో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ అజారుద్దిన్, కార్పొరేట్ సీఎన్ రెడ్డి తదితరులున్నారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?
