Jubilee Hills bypoll ( image Credit: twitter)
తెలంగాణ

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఓటింగ్ శాతం పెంపుపై ఫోకస్.. ఈసారి ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసా?

Jubilee Hills Bypoll: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో (Jubilee Hills Bypoll0 పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఫోకస్ పెట్టారు. ఒటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతులను చేయాలన్న భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే పలు కాలేజీల్లో స్వీప్ కార్యక్రమాలను నిర్వహించిన జిల్లా ఎన్నికల సిబ్బంది త్వరలోనే ఈ కార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేయాలని భావిస్తుంది. దీంతో పాటు నియోజకవర్గం పరిధిలోని ప్రముఖ ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా తయారు చేయనున్నారు. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నమోదైన పోలింగ్ శాతాన్ని వచ్చే నెల 11న జరగనున్న పోలింగ్ లో కనీసం అదనంగా పది శాతాన్ని పెంచే దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుంది.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటన.. దీపక్ రెడ్డిని ఖరారు చేసిన కమలం పార్టీ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,75,430 ఓటర్లు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,75,430 ఓటర్లు ఉండగా, ఇందులో 1,83,312 ఓట్లు పోలై 48.82 శాతం పోలింగ్ నమోదైంది. ఈ శాతాన్ని ఈ సారి గణనీయంగా పెంచాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం భావిస్తుంది. ఇందుకు గాను ప్రతి ఓటరుకు ఓటు హక్కుపై అవగాహన కల్పించటంతో పాటు తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనే చైతన్యవంతులను చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇటీవల జారీ చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 98 వేల 982 మంది ఉండగా, వీరిలో 2 లక్షల లక్షల 7 వేల 367 మంది పురుషులుండగా, లక్షా 91 వేల 590 మంది మహిళా ఓటర్లున్నారు.

కొత్తగా ఓటర్లుగా వివరాలను నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు 6976 మంది

వీరిలో థర్డ్ జెండర్ ఓటర్లు 25 మంది ఉన్నారు. 18 ఏళ్లు దాటి ఫారం-6 తో కొత్తగా ఓటర్లుగా వివరాలను నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు 6976 మంది ఉన్నారు. వీరంతా మొదటి సారి ఓటింగ్ వేస్తున్నందున ఆ అనుభూతిని పొందేందుకు ఎక్కువ మంది ఓటు వేసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కొత్త ఓటర్లలో పురుషులు 3415 మంది ఉండగా, 3561 మహిళా ఓటర్లున్నట్లు జీహెచ్ఎంసీ తుది జాబితాలో పేర్కొంది. జాబితా సవరణలో భాగంగా ఫారం-7 ద్వారా 336 మంది పురుష, 327 మంది మహిళా ఓటర్ల తో కలిపి మొత్తం 663 ఓటర్ల వివరాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ లో పాల్గొనేందుకు వీలుగా పోలింగ్ స్టేషన్ల వద్ద కనీస వసతులు, వికలాంగులకు స్పెషల్ ర్యాంప్, వీల్ చైర్ వంటి అన్ని రకాల ఏర్పాట్లతో పాటు పోలింగ్ స్టేషన్ వద్దనున్న ఓటర్ల క్యూ ను సెల్ ఫోన్ లలో చూసుకునే యాప్ ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు వెల్లడించారు.

నామినేషన్ స్వీకరణ చివరి రోజు వరకు

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే చివరి తేదీ వరకు నియోజకవర్గంలోని కొత్త ఓటర్లు ఫారం-6 తో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చుని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కూడా ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 3 లక్షల 98 వేల 982 మంది ఉన్నారని, 18 ఏళ్లు దాటి ఓటు హక్కు పొందేందుకు అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

407 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు

తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 407 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 3,98,982 మంది ఓటర్లున్నారని, నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఛాన్స్ ఉన్నందున నియోజకవర్గం మొత్తం ఓటర్ల సంఖ్య 4 లక్షలకు పెరిగే అవకాశమున్నట్లు వెల్లడించారు. ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో వెరిఫై చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వెబ్ సైట్ లో గానీ లేక నేరుగా ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో గానీ సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీలు, పౌరులు ఫారం-6, ఫారం-7, ఫారం-8 లో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత జులై 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, అర్హులు ఉండి ఇప్పటికీ ఓటరుగా నమోదు చేసుకోని వారు కూడా నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ 21 వరకు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Also Read:Jubilee Hills bypoll: నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. మూడో రోజు ఎన్నో తెలుసా?

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?