Jagga Reddy: బీఆర్ఎస్ నుంచి తాను కాంగ్రెస్‌లోకి రావడానికి మాజీ మంత్రి హరీశ్ రావు కారణం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన గాంధీ భవన్ వేదికగా స్పందించారు. ‘కేసీఆర్ కూతురు కాబట్టే కవిత నాయకురాలు అయ్యారు. కేసీఆర్ లేకపోతే కవిత లేరు. మీకు, మీ కుటుంబ సభ్యులతో ఏమైందో మాకు తెలియదు. మమ్మల్ని మధ్యలో లాగకండి. హరీశ్ రావు మీద కోపంతో జగ్గారెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చారని కవిత చెప్పారు. ఈ విషయం తప్పు. నాకు, హరీశ్‌కు మా జిల్లాలో రాజకీయ శత్రుత్వం ఎప్పటికీ ఉంటుంది. అయితే, నేను బీఆర్‌ఎస్ వీడటానికి హరీశ్ కారణం కాదు. ఆయనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. నేను ముందు నుంచీ రాజకీయం చేస్తాను. హరీశ్ వెనుక నుంచి రాజకీయం చేస్తారు. రాజకీయంగా నాకు, ఆయనకు ఉన్న వైరం వేరు, రాజనీతిలో మేం రాజకీయం చేస్తున్నాము. విలువలతో కూడిన రాజకీయం చేయాలి. మున్సిపల్ ఎన్నికల్లో నేను, హరీశ్ బీఆర్‌ఎస్‌ను గెలిపించాం’ అని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు.
Also Read: Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..
వైఎస్సార్ ఆహ్వానం మేరకే..
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రావడానికి గల అసలు కారణాన్ని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ‘నేను టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళడానికి కారణం అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మున్సిపల్ ఫలితాలతో నా రాజకీయం వైఎస్‌కు బాగా నచ్చింది. వైఎస్ చేయబట్టే నేను కాంగ్రెస్‌లోకి వెళ్ళాను. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సిద్ధిపేట, సంగారెడ్డి మినహా ఎక్కడ బీఆర్‌ఎస్ గెలవలేదు. కేవలం ఆ రెండు చోట్ల మాత్రమే బీఆర్‌ఎస్ నేతలు గెలిచారు. అందుకే జగ్గారెడ్డి నాకు రాజకీయంగా నచ్చాడని వైఎస్ తన మిత్రుడు కుసుమ కుమార్‌తో చెప్పి పంపించారు. నేను పార్టీలోకి వస్తే నియోజక అభివృద్ధి, కందిలో ఐఐటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీల మేరకే నేను అప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను’ అని ఆయన స్పష్టం చేశారు. అవగాహన, ఆలోచన లేకుండా కేసీఆర్ కూతురు కవిత మాట్లాడుతున్నారని, సోషల్ మీడియాలో ఇంకోసారి అలాంటి వీడియోలు పెట్టొద్దని హితవు పలికారు. డైరెక్ట్‌గా పోటీ చేయని వారు కూడా తాను సీఎం అవుతానని అంటే ఎలా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనకు ఇప్పుడు ప్రచార కమిటీ పదవి మీద ఇంట్రస్ట్ లేదని కూడా జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.
Also Read: Thaman Reply: థమన్ రెమ్యూనరేషన్ ఏం చేస్తారో తెలుసా.. ఆ సమయంలో అదే నడిపించింది..

