Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. నిజం మాట్లాడే ధైర్యం లేదు, దాంతో అన్ని అబద్ధాలే ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ (Congress) నాయకుల చేరిక సందర్భంగా మాట్లాడారు. ఇక్కడ ఉన్నోళ్లు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే అన్నారు. ‘‘మెదక్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టం. మెదక్ జిల్లా కలను నిజం చేసిందే కేసీఆర్’’ (KCR) అని అన్నారు.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్
నాలుగు లేన్ల రోడ్లు, డివైడర్లు, అద్భుతంగా ఉన్నాయన్నారు. సిద్దిపేట (Siddipet) అంటే పందులు, మెదక్ అంటే గాడిదులు ఎక్కువ ఉండే అనేవాళ్ళు. ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి చెందాయన్నారు. ఘణపురం కాలువ ఆధునీకరణ చేసిందే కేసీఆర్ (KCR) అని, చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు అందేలా చేశారని చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాంగ్రెస్ (Congress) పాలన ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్ల డీజిల్ పోయాక అవి మూలన పడిపోయాయని విమర్శించారు.
అబద్ధాలు అని పిచ్చి మాటలు
శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులు అయ్యింది అబద్ధామా, మోటార్లు ఆన్ చేయనిది అబద్ధమా, 65 టీఎంసీలు వినియోగించకుండా ఏపీకి నీళ్ళు వదిలింది అబద్ధమా, పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి కృష్ణ నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా మోసం చేయడం లేదా అంటూ (Uttam) ఉత్తమ్‌పై మండిపడ్డారు. పాలన చేతకాక మోటర్లు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వక అబద్ధాలు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. లక్ష క్యూసెక్కులు గోదావరిలో పోతున్నది నిజం కాదా, రేవంత్ పాలన చూస్తుంటే నీళ్ళు ఆంధ్రాకు నిధులు డిల్లీకి అన్నట్లు ఉందని సెటైర్లు వేశారు. అందుకోసమే మళ్లీ సీఎం ఢిల్లీకి వెళ్ళారని, అంతకుమించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిందేముందని నిలదీశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ (KCR) రావాలి, బీఆర్ఎస్ (BRS) రావాలి అని అంటున్నారని, అందరం కలిసి పని చేద్దాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు.
Also Read: Bhadradri Kothagudem: రెచ్చిపోతున్న కంకర మాఫియా.. నాసిరకం కంకరతో నిలువు దోపిడీ