Harish Rao: రాష్ట్రంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతూ, రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగ, ప్రతీకారం తీర్చుకుందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. సిద్దిపేట(Siddipet) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం డ్యామ్‌లు ఖాళీగా ఉన్నవని చెప్పారు. ‘బురద రాజకీయల కోసం వరద నీళ్లను వడిసి పట్టుకోవాల్సింది పోయి, సముద్రంలోకి వదులుతున్నారు. కాళేశ్వరం కూలిందని అన్నాం అని, నీళ్లు ఇస్తే ఎట్లా? అని, మోటర్లు ఆన్ చేయకుండా ప్రాజెక్టులు నింపడం లేదు.
Also Read: Udaya bhanu: రియాలిటీ షోస్ లో చూపించేది నిజం కాదా? సంచలన కామెంట్స్ చేసిన ఉదయభాను
కాళేశ్వరంపై మరో కుట్ర
నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)కి లేఖ రాశాను. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి మిడ్ మానేర్, అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నింపాలని కోరాను. రేవంత్ రెడ్డి,(Revanth Reddy) ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddyలకు నీళ్లు విలువ, వ్యవసాయ తెలియదు. ఎస్ఆర్ఎస్‌పీ వరద కాలువ ద్వారా నీళ్లు నింపాలి. మీరు మోటార్లు ఆన్ చేయకుంటే వేలాది మంది రైతులతో వెళ్లి, కాళేశ్వరం మోటర్లు మేమే ఆన్ చేస్తాం. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ యూరియా కోసం చెప్పులు లైన్‌లో పెడుతున్నారు. కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తున్నారు. మోటర్లను ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల పనికి రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానండి’ అని సర్కార్‌పై హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read: Block Widow Case: ప్రపంచంలోనే క్రూరమైన భార్య.. ఏకంగా 11 మంది భర్తలను లేపేసింది!