Harish Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లోని ఎస్ పీ ఆర్ గ్రాండ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొని మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యమైనదని, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు.. బాండ్ పేపర్లు రాసి ఇచ్చారన్నారు. వంద రోజులు కాదు, 7వందల రోజులు దాటినా అమలు చేయడం లేదని, అందుకే రేవంత్ రెడ్డికి జుబ్లిహిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలని ప్రజలు కోరుతున్నారన్నారు.
Also Read: Harish Rao: జోర్డాన్ గల్ఫ్ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్!
హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటు వేసారు
లేకుంటే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటు వేసారు అని రేవంత్ అంటారన్నవారు. ఉద్యోగాలు రావాలన్నా, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, మాగంటి సునిత గెలవాలని అన్నారు. బిల్డింగ్ పర్మిషన్ కు స్క్వేర్ ఫీట్ కు రూ.75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12శాతం కమిషన్ ఇవ్వాలట అని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక మొత్తం పర్సెంటేజీలు డిసైడ్ చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు.. గాంధీ టోపీలు పెట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ 350 బస్తీ దవాఖానలు ప్రారంభించారని, ఉచితంగా పరీక్షలు చేసే విధంగా డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ప్రారంభించారని తెలిపారు.
సునిత గెలుపు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల గెలుపు,
రేవంత్ ప్రభుత్వం బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిందని, ఆరు నెలలుగా బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది జీతాలు చెల్లించడం లేదు.. మందులు లేవు అని మండిపడ్డారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు 20వేల లీటర్ల వరకు బిల్లులు లేవు రేవంత్ వచ్చిండు బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సునిత గెలుపు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాని అక్కా చెల్లెల్ల గెలుపు, పింఛన్లు రాని అవ్వాతాతల గెలుపు, నిరుద్యోగుల గెలుపు అన్నారు. రేవంత్ రెడ్డి ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోదు, ప్రభుత్వం పోదు కాని ఆయనకు అర్థం కావాలే అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తది.. రావోద్దు అంటే బీఆర్ఎస్ గెలవాన్నారు. ముస్లింలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి ఇవ్వలేదని మండిపడ్డారు.
పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తకాదు
హిందు, ముస్లీం అందరం కలిసి హైద్రాబాద్ ను, తెలంగాణను కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలు బాగా కలిసి పనిచేస్తున్నారని, కేటీఆర్ , నేను జుబ్లిహిల్స్ ను ఆనుకొని ఉన్నాం పిలుస్తే పది నిమిషాల్లో మీకు అండగా వస్తాం.. ఎవరూ భయపడవద్దు. మీ ముందు నిమిషాల్లో ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఆపద వస్తే, మెసేజ్ చేస్తే చాలు నేను మీ ముందుంటామని స్పష్టం చేశారు. ఉద్యమాలు, పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తకాదు. భయపడకండి..కేసీఆర్ కి జుబ్లిహిల్స్ గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ను దించిందని, మనం కూడా కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు
మన రక్తంలోనే పోరాటం ఉంది.. మొక్కవోని ధైర్యంతో ఉన్నాం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మన రక్తంలోనే పోరాటం ఉంది.. మొక్కవోని ధైర్యంతో ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మీ కసి, పట్టుదల, తపన బీఆర్‌ఎస్ విజయానికి నాంది కావాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, రేవంత్‌రెడ్డిని తెలుగు భాషలో తిట్టరాని తిట్లు తిడుతున్నారన్నారు. ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచ్చిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలి.
ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలి
గులాబీ జెండా రెపరెపలాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలని కేడర్ కు పిలుపు నిచ్చారు. 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల అందరి చూపూ జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారన్నారు. ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామని ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోయిండ్రు అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూలగొట్టడమా? అని నిలదీశారు.
Also Read: Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!
