Harish Rao (imagecredit:twitter)
తెలంగాణ

Harish Rao: జోర్డాన్ గల్ఫ్ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్!

Harish Rao: ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటు అన్నారు. నిర్మల్(Nirmal), కామారెడ్డి(kamareddy), నిజామాబాద్(Nizamabad), జగిత్యాల(Jagithyala), సిద్దిపేట(Sidhipeta)కు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మా పాలనలో వలసలు వాపస్..

అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) పాలనలో వలసలు వాపస్ అయితే, ఇప్పడు వలసలు మల్లా మొదలయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి, ఉద్యోగాలు కరువై ఎడారి ప్రాంతాలకు వలస పట్టే దుస్థితి వచ్చిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే.. కాంగ్రెస్(Congress) పార్టీ వలస కార్మికుల కుటుంబాలను సైతం దారుణంగా వంచించిందన్నారు. అభయ హస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేయలేదన్నారు.

Also Read: Musharraf Farooqui: బస్తీ బాటలో భాగంగా తెలంగాణ విద్యుత్ సంస్థ కీలక నిర్ణయం..?

టోల్ ఫ్రీ హెల్ప్ లైన్..

ఏడాదిన్నర పాలన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ ఏం చేస్తున్నట్లు? అని నిలదీశారు. గల్ఫ్ కార్మికులు సంక్షోభంలో ఉంటే ఆ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, సభ్యులు ఏం చేస్తున్నట్లు? మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నారైల సంక్షేమ బోర్డు, గల్ప్ సంక్షేమ బోర్డులకు అతీ గతి లేదన్నారు. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తానన్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇప్పటికీ దిక్కులేదు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు చొరవ చూపి జోర్డాన్ లో ఉన్న గల్ఫ్ కార్మికులను వెంటనే తెలంగాణకు రప్పించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: DGP Shivdhar Reddy: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ముఖ్య సభ్యులు సరెండర్!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?