Harish Rao: సింగరేణి లో బయటపెట్టాల్సిన ఇంకా కుంభకోణాలు ఉన్నాయి..రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. మైక్రో బ్రైవరేజ్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్ లు వచ్చాయని, అందులో 25 అప్లికేషన్ ల టెండర్ లు ముఖ్యనేతకు ,మంత్రికి ఇచ్చేందుకు సిద్దమయ్యారన్నారు. అందులో ముఖ్యనేత కోటా కింద 21 టెండర్లు , మిగిలిన 4 మంత్రి కోటా కింద కేటాయించారని ఆరోపించారు.
వైన్స్ షాపుల లక్కీ
ఈ మధ్య ముఖ్య నేతకు నీడగా ఉండే వ్యక్తి వార్తల్లో నిలుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్య నేతకు నీడగా ఉండే, ఆ నేత నేరుగా ముఖ్య నేత ఇంటికి వెళ్తారని, ఈ మధ్య ముఖ్యనేత తిరుపతికి పోయినప్పుడు నీడగా ఉన్నాడన్నారు. ఒక్కొక్క బ్రైవరేజ్ దగ్గర అన్ అఫిషియల్ గా కోటి 80 లక్షలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారన్నారు. అందులో కోటి 50 లక్షలు ముఖ్య నేతకు వెళ్తాయి, మరో 30లక్షలు తోడుగా ఉన్న వ్యక్తికి వెళ్తాయని, వైన్స్ షాపుల లక్కీ డ్రా తియ్యకుండా, కొందరికి టెండర్ లు వచ్చాయన్నారు.
Also Read: Bhatti Vs Harish Rao: భట్టి గారూ… నేను సూటిగా అడుగుతున్నా.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
4500 కోట్లు బకాయిలు
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4500 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టారన్నారు. 16 నెలల నుంచి సరఫరా చేసే కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదన్నారు. చరిత్రలో ఇది ఎప్పుడు జరగలేదని, దీని వల్ల బ్రీజర్ సరఫరా రాష్ట్రంలో ఆగిపోయిందన్నారు. చాలా షాపుల్లో బ్రీజర్ సరఫరా ఆగిపోయిందని, మిగిలిన కొన్ని కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు సరఫరా నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలు రాశారన్నారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీతో ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి రైతులు అంటే చులకన
ఆలో గ్రామ్ టెండర్ వ్యవహారంలో అల్లుడుకి కావాలని ముఖ్యనేత , మంత్రి కుమారుడుకి కావాలని మంత్రి పంచాయతీలో ఐఏఎస్ అధికారిస్వచ్ఛంద విరమణకు దారి తీసిందన్నారు. బీరు కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యత , రైతులకు ఇవ్వడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులు అంటే చులకన అని మండిపడ్డారు. మెదక్ జిల్లా సింగూర్ డ్యాం కింద రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. సంగారెడ్డిలో 40 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే, మెదక్ జిల్లా ఘనపురం కింద30 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయంలో 5 లక్షల భీమా
సంగారెడ్డి జిల్లాలో ఉండే బీరు కంపెనీలకు మాత్రం ఎటువంటి హాని లేకుండా బీరు కంపెనీలకు నీరు సరఫరా చేస్తున్నారన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాలతో బీరు కంపెనీలకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం మద్యం తయారీ దారులకు కొమ్ము కాసే ప్రభుత్వంలా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గీత కార్మికులను వందల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టీ జైలు పాలు చేశారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 850 మంది గౌడ్స్ మరణించారన్నారు. వారికి ఇవ్వాల్సిన ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయంలో 5 లక్షల భీమా పథకం తీసుకొచ్చి గౌడన్నల కుటుంబాన్ని మేము ఆదుకున్నామన్నారు.
10 రూపాయిలు కూడా ఇవ్వలేదు
కాంగ్రెస్ పార్టీ 10 లక్షల బీమా ఇస్తామని చెప్పి10 రూపాయిలు కూడా ఇవ్వలేదన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలం లక్ష్కర్ గూడ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అనేక మాటలు గౌడన్నలకు చెప్పి మోసం చేశారన్నారు. గౌడ్లు అంటే రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిందని మండిపడ్డారు. గల్లీ గల్లీకి మద్యం దుకాణాలు తెచ్చారని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 10 వేల కోట్ల ఆదాయం పెంచుకున్నారన్నారు. మహిళలకు తులం బంగారం ఇవ్వడం లేదు గానీ, తాగుబోతుల తెలంగాణగా మాత్రం మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హిళలకు మాంగల్యం దూరం చేస్తుందని మండిపడ్డారు.

