Harish Rao: సిట్‌కు కొత్త పేరు పెట్టిన హరీశ్ రావు..?
Harish Rao (imagecredit:twitter)
Telangana News

Harish Rao: సిట్‌కు కొత్త పేరు పెట్టిన హరీశ్ రావు.. రేపు మేం వచ్చాక ఓక్కర్ని కూడా వదిలిపెట్టం అంటూ..?

Harish Rao: రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. మీడియాకు వరుసగా లీకులు ఇస్తున్నారని, దానికి ఆధారాలు ఏంటి, మీడియా సంస్థలు కూడా నిజంగానే జరుగుతున్నట్టు ప్రసారం చేస్తున్నాయని, కానీ వాస్తవ పరిస్థితులు వేరని అన్నారు. కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రభుత్వంపై సింగరేణిలో జరుగుతున్న అవినీతిని పూర్తి ఆధారాలతో బయటపెట్టామన్నారు.

మీడియా క్రాస్ చెక్ చేసుకోవాలి

మొన్న తాను సిట్ ముందుకు వెళ్లినప్పుడు దుష్ప్రచారం చేశారని, వాస్తవానికి జరిగింది వేరని హరీశ్ రావు తెలిపారు. బయట లీకులు ఇస్తూ ప్రచారం చేయించిన స్క్రిప్ట్ వేరు అన్నారు. ఒకరకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననం అవుతుందన్నారు. లీకులను మీడియా క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లీకు వార్తల విషయంలో చిల్లర రాజకీయాలు, డ్రామాలు చేస్తున్నదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయాలని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌ను తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుందన్నారు. బొగ్గు కుంభకోణం వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిన్నదని విమర్శించారు. కోల్ స్కాం ఎలా అయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారి తీసిందో నేటి ఈ బొగ్గు కుంభకోణంతో కాంగ్రెస్ పతనానికి బీజం పడిందని, యూపీఏ ప్రభుత్వంలో కోల్ స్కాం రూ.1,50,000 కోట్లు అని గుర్తు చేశారు. అది మొత్తం దేశాన్ని కుదిపేసిందన్నారు. ఈ గండం గట్టేక్కేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీతో కుమ్మక్కై సిట్ల డ్రామా చేస్తున్నారన్నారు.

Also Read: TPCC Chief: యావత్ ఫ్యామిలీ.. అలీ బాబా దొంగల బ్యాచ్.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ చురకలు

అధికారులకు హెచ్చరిక

రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి తమపై ప్రయోగిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చానా ఆ పోలీసులను వదిలిపెట్టేది లేదన్నారు. అంతకు అంత అనుభవిస్తారని హెచ్చరించారు. రిటైర్ అయినా కూడా వదిలిపెట్టమని, రేపు అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదన్నారు. మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. తాము తప్పు చేయలేదని ఎవరికీ భయపడేది లేదన్నారు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగిందని, ఆరోజు ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీస్తే, కేటీఆర్ మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయిస్తే ఏం చేశారని హరీశ్ రావు అడిగారు.

Also Read: Graveyard Encroachment: స‌మాధులపై.. పునాదులు.. మ‌ణికొండ‌లో షాకింగ్ విషయం వెలుగులోకి!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?