Naveen Yadav ( image credit: swetcha reporter)
Politics

Naveen Yadav: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గర్జన.. ప్రచార జోరు పెంచిన నవీన్

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయి సమన్వయం కోసం టీపీసీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. టీపీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తూ, జూబ్లీహిల్స్ బైపోల్ కొరకు ఒక కో-ఆర్డినేషన్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఛైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ కో-ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు రోహిన్ రెడ్డి, సమీర్ వాలీయ్, మోతో శోభన్ రెడ్డి, విజయారెడ్డి, రజితా పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, బానోత్ సుజాత, మహాలక్ష్మి రామన్ గౌడ్, పూజిత, మంజుల, బూరుగడ్డ పుష్ఫ, ఇందిరా శోభన్, రేగులపాటి రమ్యారావు, ఉజ్మా షకీర్‌లు సభ్యులుగా ఉన్నారు. వారం రోజుల పాటు జరిగే ఎన్నికల ప్రచారాన్ని ఈ కమిటీ పర్యవేక్షించడంతో పాటు, క్షేత్రస్థాయి కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నది.

Also Read: Naveen Yadav: జూబ్లీహిల్స్ సీటుపై నవీన్‌ యాదవ్‌కు కలిసొచ్చిన అసలు ప్లస్ పాయింట్లు ఇవే!

ఇంటింటికీ ప్రజా పాలన

యూసుఫ్‌గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, శివసేన రెడ్డి, బెల్లయ్య నాయక్, గిరిధర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్ గౌడ్, నల్లపనేని అనిల్‌తో సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారాన్ని వేగవంతం చేయాలని మంత్రులు నేతలకు దిశానిర్దేశం చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో డోర్ టూ డోర్ ప్రచారంలో ప్రతి ఇంటింటికీ ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని ఏర్పాటు చేసుకొని, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

పెరుగుతున్న ప్రచార జోరు

మరోవైపు, నవీన్ యాదవ్ తన ప్రచార జోరును రోజు రోజుకీ పెంచుతున్నారు. ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రమ్య రావులతో కలిసి వెంగళ్‌రావు నగర్ డివిజన్, యాదగిరి నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, అభివృద్ధి పనులు ఆగిపోయిన ఈ ప్రాంతంలో తిరిగి చైతన్యం తీసుకురాగలిగేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మళ్లీ అభివృద్ధి దిశగా సాగుతోందని, ఆ మార్పులో జూబ్లీహిల్స్ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ప్రజలతో కలిసి మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని నవీన్ హామీ ఇచ్చారు. సుమన్, మనోహర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు మాట్లాడుతూ, నవీన్ యువ నాయకుడు, ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడని, ఆయన విజయం అనేది జూబ్లీహిల్స్ ప్రజల విజయం అవుతుందని పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి ఆత్మీయ స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతాకం ఎగరడం ఖాయం అన్న నమ్మకంతో నవీన్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.

Also Read: Naveen Yadav: ఇరకాటంలో నవీన్ యాదవ్?.. ఓటర్ ఐడీ పంపకాలతో ఎఫ్ఐఆర్ నమోదు!

Just In

01

Android Vs iPhone: ఐఫోన్ యూజర్లు షాక్‌కు గురయ్యే విషయాన్ని వెల్లడించిన గూగుల్

MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు

Bigg Boss Telugu 9: టార్గెట్ తనూజ.. నెక్ట్స్ వీక్ వెళ్లిపోయేది తనేనా?

Land Auction: ప్రారంభ ధర ఎకరం రూ.99 కోట్లు.. హైదరాబాద్‌లో మరోసారి భూవేలానికి వేళాయె!

Sai Srineeth: మెరిసిన ముత్యం.. వెయిట్ లిఫ్టింగ్‌లో జమ్మికుంట విద్యార్థికి రెండవ స్థానం