Mahesh Kumar Goud: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…కుల సర్వేకు ఆద్యులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం శాస్త్రీయ బద్దంగా కుల సర్వే నిర్వహించి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు మద్దతు ఇస్తున్నామన్నారు. బంద్ విజయవంతం కావాలని కోరారు. బీసీ బంద్ తో కనువిప్పు కలగాలన్నారు.
Also Read: Mahesh Kumar Goud: ఇది మా కుటుంబ సమస్య.. మేము పరిష్కరించుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు?
అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డు పడుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పరంగా పోరాడుతామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉన్నదన్నారు. రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ బిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.సీఎం రేవంత్ కు, తనకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా లేదన్నారు. అసెంబ్లీ లో రెండు చట్టాలు చేసినా..పెండింగ్ లో పెట్టడం విచిత్రంగా ఉన్నదన్నారు.
హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తాం
తెలంగాణ జేఏసీ18 న బంద్ కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందన్నారు. హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై పీసీసీ అధ్యక్షుడు సీపీఎం నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ…జూబ్లీ హిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమన్నారు. ప్రజాభిప్రాయం మేరకే ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపిక జరిగిందన్నారు. కేసీఆర్ పదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు మరిచిపోలేదన్నారు.
Also Read: Mahesh Kumar Goud: కవిత పాత్రతో కేసీఆర్ కొత్త నాటకం… పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
