Mahesh Kumar Goud (imagecredit:swetcha)
తెలంగాణ

Mahesh Kumar Goud: ఇది మా కుటుంబ సమస్య.. మేము పరిష్కరించుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: మంత్రుల మధ్య వివాదాలు కామన్ అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌(TPCC Mahesh Kumar Goud) అన్నారు. ఇది తమ కుటుంబంలోని సమస్య అని, తామే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)ను దిల్లీలో ఆయన పరామర్శించారు. ఇటీవల ఖర్గేకు వైద్యులు పేస్‌మేకర్‌ అమర్చిన సంగతి తెలిసిందే. ఖర్గేతో భేటీ అనంతరం మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే సహా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయనకు వివరించినట్లు తెలిపారు. త్వరలోనే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేయనున్నట్లు వివరించారు.

నేనేం చేశాను: మంత్రి పొంగులేటి

తానమేంటో అందరికీ తెలుసని, రూ. 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అవసర తనకు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponuguleti Srinivass Reddy) అన్నారు. ఇటీవల మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ(Min KOnda Sureka), ఆమె భర్త కొండా మురళి(Konda Murali) కాంగ్రెస్ అధిష్ఠానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. తన శాఖలో, వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తన్నం చేస్తున్నారని, ఆయన జోక్యం రోజు రోజుకూ మితిమీరుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విమర్శలపై ఆయన సోమవారం స్పందించారు. ‘నేను ఏంటో అందరికీ తెలుసు. రూ.70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అవసరం లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. నా మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏం ఉంది. సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క-సారక్కలాగ పనిచేస్తున్నారు’ అని పొంగులేటి పేర్కొన్నారు.

Also Read: Mysterious Temples: శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని అత్యంత రహస్యమైన దేవాలయాలున్నాయని తెలుసా?

42 శాతంపై అమలు ఆరా..

42 శాతం రిజర్వేషన్ల అమలు పరిస్థితిపై ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే ఆరా తీశారు. తనను కలిసిన పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్ నుంచి వివరాలు సేకరించారు. కోర్టులోని సమస్యలు, బిల్లు, ఆర్డినెన్స్ అంశాలపై ఆరా తీశారు. సుప్రీం కోర్టు అడ్వకేట్లతో తాను మాట్లాడుతానని ఖర్గే హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్​బంగా పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, వీలైనంత త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇటీవల పరిణామాలపై ఖర్గేకు వివరించానన్నారు. బీసీల రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగిన వ్యవహారాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇక ప్రభుత్వం వేసే పిటిషన్ కు,కాంగ్రెస్(Congress) పార్టీలోని నాయకులు కూడా ఇంప్లీడ్ అవుతారన్నారు. ఇక పార్టీలో చిన్న సమస్యలు కామన్ గా ఉంటాయని, త్వరలో అన్ని చక్కదిద్దుకుంటాయని ఆయన వెల్లడించారు.

Also Read: Adwait Kumar Singh: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు