కవిత పాత్రతో కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు. కేసీఆర్(kcr) ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ ఎంక్వైయిరీ వేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ కు సంబంధం లేదంటే కుదరదని ఆయన నొక్కి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కవిత దొంగ డ్రామాలు బంద్ చేయాలన్నారు. కేసిఆర్ కుటుంబం దొంగల ముఠా అని పేర్కొన్నారు. వాటాల పంపకాల తేడాతోనే కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయన్నారు.
Also Read: SSMB29 Kenya Shoot: ఆ క్రేజ్ ఏంటి భయ్యా.. ఖండాలు దాటిపోయింది.. నువ్వు దేవుడివి సామీ
వేల కోట్లు దోచుకున్నారు
కవిత రూపంలో కేసీఆర్(Kcr) ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కవిత చిలక పలుకులు పలుకుతున్నారన్నారు. కవిత(Kavitha) చెప్పిన మాటలు నిజమైతే గతంలోనే హరీష్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని? ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై పీసీ ఘోష్ పరిపూర్ణంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీశారన్నారు. సమగ్ర విచారణ జరిపి కేసిఆర్ ,హరీష్ రావులను దోషులుగా తేల్చారన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఇప్పుడు కాళేశ్వరంపై చర్యలు తీసుకునే ఛాన్స్ వచ్చిందని, వెంటనే ఆ టాస్క్ ను పూర్తి చేయాలన్నారు. చెట్లు, భూములు అమ్ముకొని బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేయబోతున్నామన్నారు.
కార్పొరేట్ కళాశాలలో చదువుకునే అవకాశం
ఇక వైఎస్సార్ చరిత్ర తిరగరాసిన మహానాయకుడన్నారు. 2004 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిన నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు పంచభూతాలు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పేదింటి బిడ్డల పాలిట వరంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేదింటి బిడ్డలు కార్పొరేట్ కళాశాలలో చదువుకునే అవకాశం లభించిందన్నారు.
ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 సేవలు ఆయన నాయకత్వానికి ఆనవాళ్లుగా చెప్పుకొవచ్చన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇటీవలే కీయో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు.2027లో జరగబోయే ఆసియన్ కరాటే ఛాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
Also Read: IRDAI employee: రూ.5.30 కోట్లు కాజేసిన ఐఆర్డీఏఐ ఉద్యోగి.. తర్వాత ఏం జరిగిందంటే?