Mahesh Kumar Goud: కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీ(DCC)లు ఇచ్చే అవకాశం ఉన్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇవ్వడం వలన పార్టీకి మరింత మేలు జరుగుతుందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సతీమణి పద్మావతి(Padmavathi) కూడా డీసీసీ పదవి కోసం అప్లై చేశారన్నారు. ఎమ్మెల్యేలకు డబుల్ పదవులు కింద పరిగణించమని పేర్కొన్నారు. కుటుంబాలు అప్పటికే పార్టీలో ఉండి సర్వీస్ చేస్తుంటే అడ్డంకి ఉండదన్నారు. సడన్‌గా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరని క్లారిటీ ఇచ్చారు. రెండు పదవులు ఇవ్వొద్దనే నిబంధన పార్టీలో ఉన్నదన్నారు. ఒక పదవికి సెలక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడన్నారు. జూబ్లీహిల్స్‌లో 46 వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వారంతా సర్కార్, పార్టీకి అండగా నిలుస్తారన్నారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులన్నింటినీ హైకమాండ్ గమనిస్తుందన్నారు. నేతలంతా హైకమాండ్ రాడర్‌లోనే ఉన్నారన్నారు.
మంత్రుల ఇష్యూ క్లోజ్…
మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయనం అంటూ పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయమని, మంత్రి కొండా సురేఖ(Konda Sureka) వివాదంలో ఇదే జరిగిందన్నారు. పోలీసులు ఆమె ఇంటికి రావడంతో ఆమె కూతురు ఆగ్రహంతో మాట్లాడినట్లు ఇప్పటికే వివరణ ఇచ్చారన్నారు. లీడర్లు ఎంత ఎదిగితే అంత ఒదగాల్సిన అవసరం ఉన్నదన్నారు. గోడలకు చెవులు ఉండే అవకాశం ఉన్నదని, ఇంటర్నల్స్ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మంత్రుల ఇష్యూలో పోలీసుల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్నారు. దీన్ని కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao)లు వారికి అనుకూలంగా మార్చుకున్నారన్నారు.
Also Read: Mahabubabad: రాష్ట్రంలో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. రూ.3 లక్షలకు సెటిల్‌మెంట్!
కేంద్రం నుంచి సపోర్ట్ లేదు..
ఇక కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం అందడం లేదన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు. మెట్రో ఫేస్ టూకు కిషన్ రెడ్డి(Kishan Reddy) అడ్డంకిగా మారారన్నారు. ఆయన బాధ్యత లేనట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ(BJP) ఎప్పుడైనా మతం అంశమేనని చెప్పారు. మతం పేరుతో ఓట్లు దండుకోవడం కామన్ అంటూ వివరించారు. బీజేపీ నేతలు మతం కులం పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్(Bandi Sanjay) కూడా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం తమ సంస్కృతి కాదన్నారు. మాగంటి కుటుంబ విషయాలు మీడియాలో వచ్చినప్పుడే తమకు తెలిసిందన్నారు. కేసీఆర్(KCR)ను ఇప్పటికీ ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని, కానీ, పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడపలేకపోయారన్నారు. అందుకే రాష్ట్రం దివాళా తీసిందని పేర్కొన్నారు.
Also Read: Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?
