TG Congress: స్ధానిక ఎన్నికల్లో పార్టీ పటిష్టత కోసం నిరంతరం పనిచేసే నేతలకు ప్రాధాన్యతనివ్వాలని కాంగ్రెస్(Congress) పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలను మొదటగా గుర్తించి, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కార్యకర్తల పేర్లు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎన్నికలపై ఏవిధంగా అడుగులు వేయాలి, అభ్యర్థులు ఏలా ఉండాలనే విధంగా చర్చలు చేశారు.
మండలంలో క్రీయశీలకంగా పార్టీలో ఉన్న కోంత మంది సలహా సూచనలతో పార్టీ నియోజకవర్గా ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపికపై జల్లడపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 26శాతం రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాతే స్ధానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం 26శాతం బీసీలకు రిజర్వేషన్ ఎన్నికల్లో ఇస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం జిల్లాల్లోని ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC), ఎంపీపీ(MPP), సర్పంచ్‌లు, వార్డు మెంబర్స్‌తో పాటు జిల్లా పరిషత్తు చైర్పర్సన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమై అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
పార్టీ నిబంధనల ప్రకారమే ఎంపిక..
పార్టీ సీనియార్టీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా రాజకీయాల్లో యువతకు పెద్దపీఠ వేసేందుకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే గత అసెంబ్లీ, ఎం(MP)పీ ఎన్నికల్లో క్రియశీలకంగా పనిచేసిన నేతలకు సైతం ప్రాధన్యత కల్పించేందుకు ప్రక్రియను ప్రారంభించింది. పార్టీ సీనియార్టి అయినప్పటికి వ్యవహారశైలిపై కూడా పునరాలోచించాలని కాంగ్రెస్(Congress) నియోజకవర్గ ఇంచార్జీలకు సూచన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాల రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మొదటి స్ధానిక నాయకుల సమాలోచనలతో అభ్యర్థులను ఎంపిక చేయగా, ఆతర్వాత మండలంలోని నాయకులతో చర్చించి అన్ని రకాలుగా అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అధిష్టానం నిబంధనలకు అనుగుణంగా అభ్యర్ధుల బలాబలాలను అంచనా వేస్తూ ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపినట్లు సమాచారం.
Also Read: Jogulamba Gadwal: మూగ జీవాల రోధన పట్టదా? మందుల కొరతతో జీవాల ఆరోగ్య క్షీణత
గెలుపే లక్ష్యంగా అడుగులు..
ఇటీవల కాలంలోనే రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు(Minister Duddila Sridhar Babu)తో రంగారెడ్డి(Rangareddy), వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కంటే పార్టీ పటిష్టతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల జాబితా రూపోందించాలని సూచించారు. వర్గాల పేరుతో పార్టీని విచ్చిన్నం చేస్తే ఆ నాయకులపై క్రమశిక్షణ చర్యలుంటాయిని ఘాటుగానే వివరించినట్లు తెలుస్తోంది. అభ్యర్ధి ఎంపిక చేసేటప్పుడు ప్రత్యార్థులను బేరీజు వేసుకోని పనిచేయాలని మంత్రి నాయకులు చెప్పారు.
ప్రతిపక్ష పార్టీ విమర్శిలను తప్పికోట్టి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి కాంగ్రెస్ నాయకులు వివరించినట్లు తెలుస్తోంది. ఏదీఏమైన అత్యధిక జడ్పీటీసీ(ZPTC)లను, ఎంపీటీసీ(MPTC)లను గెలిపించుకోని జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ(MPP)లను కైవసం చేసుకోవాలని తెలిపారు. ఆశావాహులందరికి న్యాయం చేయని పక్షంలో పార్టీలో కలిసి పనిచేసేటట్లు ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం.
Also Read: OG Collections: విధ్వంసం.. ‘ఓజీ’ మూవీ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే?
