Mahesh Kumar Goud: బీసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదన్నారు. ఈ బంద్ లో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నతంగా ఆలోచించి బంద్ లో పాల్గొంటున్నామన్నారు. బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేరన్నారు. అసెంబ్లీ లో రెండు చట్టాలు చేసినా పెండింగ్ లో పెట్టారన్నారు. అందుకే జీవో ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇక హైకోర్టులో రిజర్వేషన్ల పై ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తుందన్నారు.
Also Read: Mahesh Kumar Goud: ఇది మా కుటుంబ సమస్య.. మేము పరిష్కరించుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్
మిత్రపక్షాల ఐక్యతే కాంగ్రెస్ బలం
కాంగ్రెస్ పార్టీ తరపున మిత్ర పక్షమైన సీపీఐ నేతలతో బీసీ జేఏసీ బంద్,జూబ్లీ హిల్స్ మద్దతు పై చర్చించామని పీసీసీ చీఫ్ వెల్లడించారు. హైదరాబాద్ సీపీఐ కార్యాలయం మక్దుం భవన్ లో ముఖ్య నేతలతో టిపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రపక్షాల ఐక్యతే తమ బలం అని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు సీపీఐ మద్దతుగా నిలించిందన్నారు.
నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారు
ఈ పరంపర భవిష్యత్ లోనూ కొనసాగుతుందని ఆకాంక్షించారు. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కార్యదర్శి సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ,కార్యదర్శి సభ్యులు కలవేణి శంకర్, పశ్య పద్మ,బాగం హేమంత్ రావు, బాల నరసింహ, విఎస్ బోస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: PCC Mahesh Kumar Goud: పదవులపై కోరికలు లేవ్.. పార్టీని పవర్‌లో ఉంచడమే నా లక్ష్యం..?
