Boyinapalli Vinod Kumar: కాంగ్రెస్ వి మోసపూరిత మాటలే తప్ప చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boynapalli Vinod Kumar) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు(Local elections) ,జీవో నెంబర్ 9 పై నిన్న హై కోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మారు కానీ ఇపుడు నమ్మడం లేదన్నారు. ఇందిరాగాంధీ(Indira Gandhi) పదవికి ముప్పు వచ్చినపుడు ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ ల రిజర్వేషన్ల పెంపు కుదరదని కృష్ణమూర్తి కేసులో సుప్రీం తీర్పు వచ్చిందని, అప్పుడు అధికారం లో ఉన్న కాంగ్రెస్(Congress) ఆ తీర్పునకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు ? అని నిలదీశారు.
వోడాఫోన్ కు లబ్ది చేకూర్చిన బీజేపీ
ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగాన్ని సవరిస్తారు. బీసీ(BC) ల కోసం సవరించరా ? బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ మోడీని ఎందుకు కౌగిలించుకోరు ? రాహుల్ గానీ ఖర్గే గానీ తెలంగాణ లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటు లో ఎందుకు మాట్లాడ లేదని అని ప్రశ్నించారు. రాహుల్ మోడీ తలచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెరగవా ? ఈ దేశం రాజ్యాంగం మీద నడుస్తుంది తప్ప మరెవరి ఇష్టాయిష్టాల మీద కాదు అని స్పష్టం చేశారు. వోడాఫోన్ 40 వేల కోట్ల రూపాయల మేర ఇన్కమ్ టాక్స్ కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని తిరస్కరించిందని తెలిపారు. వోడాఫోన్ కు లబ్ది చేకూర్చిన బీజేపీ బీసీ ల రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని ఎందుకు సవరించదు ? అని ప్రశ్నించారు.
Also Read: Musharraf Farooqui: బస్తీ బాటలో భాగంగా తెలంగాణ విద్యుత్ సంస్థ కీలక నిర్ణయం..?
తొమ్మిదో షెడ్యూల్‌లో
బీసీ కుల గణన పై కూడా సుప్రీం తీర్పు ను దాటవేసేలా పార్లమెంటులో బీజేపీ చట్ట సవరణ తెచ్చిందన్నారు. బీ ఆర్ ఎస్ హై కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని మంత్రి ప్రభాకర్ అంటున్నారని ప్రశ్నించారు. బీ ఆర్ ఎస్ డ్రామా కంపెనీ కాదు బీసీ లతో రాజకీయాలు చేయడానికి అని మండిపడ్డారు. తొమ్మిదో షెడ్యూల్ లో చేరిస్తే తప్ప బీసీ లకు రిజర్వేషన్లు పెరగవు అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ బీజేపీ(BJP) లు కలిసి తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడం కోసం ప్రయత్నాలు చేయాని, అందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు. డ్రామాలు ఇప్పటికైనా కట్టిపెట్టి.. బీసీ లను మోసం చేయాలనే వైఖరిని కాంగ్రెస్ విడనాడాలన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని, మోడీ పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు పెంచేలా వారు ఎందుకు కృషి చేయడం లేదు ? తమిళనాడు లో బీసీ లకు విద్యా ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప స్థానిక సంస్థల్లో 50 శాతం మించి లేవు అని వెల్లడించారు. సమావేశం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, లీగల్ సెల్ ప్రతినిధి సి .కళ్యాణ్ రావు పాల్గొన్నారు.
Also Read: Land Scam: రూ.60 కోట్ల భూమి కబ్జా!.. పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారులు
