Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే.. తెలంగాణకు శాపం
Bandi Sanjay ( image credit: swetcha reporter)
Political News

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే.. తెలంగాణకు శాపం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల పాపాలే.. తెలంగాణ ప్రజల పాలిట శాపాలయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌తోనే ఆ రెండు పార్టీలు దోపిడీకి తెరదీశాయని మండిపడ్డారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇందులో మొదటి దోషి కాంగ్రెస్సే అని దుయ్యబట్టారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు జాతీయ హోదా ఎట్లా అడిగారని ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ, వారం, పది రోజులుగా నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, అవినీతిపై విచారణ లేకుండా బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. తెలంగాణకు నీళ్ల అన్యాయం చేసిన మొట్టమొదటి దోషి కాంగ్రెస్సే అని బండి విమర్శించారు.

ఉమ్మడి ఏపీలో కృష్ణా వాటాలో 811 టీఎంసీలుంటే, ఏనాడూ తెలంగాణకు 200 టీఎంసీలకు మించి నీటిని వాడుకోకుండా ఇక్కడి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. గోదావరిలో 1,486 టీఎంసీల నీటి వాటా ఉంటే, తెలంగాణలో ఎన్నడూ 500 టీఎంసీలకు మించి వాడుకోలేదన్నారు. ఏపీ పునర్విభజన యాక్ట్ సెక్షన్ 89 ప్రకారం, రాష్ట్ర విభజన నాటికి నిర్మాణంలో, ప్లాన్‌లో ఉన్న నీటి ప్రాజెక్ట్‌లపై అభ్యంతరం తెలపొద్దని స్పష్టంగా ఉందని, ఆ సెక్షన్‌లో ఏపీలోని 4, తెలంగాణలోని 2 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్‌లను పొందుపర్చారని, మరి తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పొందుపర్చలేదని నిలదీశారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎందుకు నిలదీయలేదన్నారు. పునర్విభజన యాక్ట్‌లోని సెక్షన్ 89లో పాలమూరు ప్రస్తావనే లేనప్పుడు జాతీయ హోదా ఎలా అడిగారని ప్రశ్నించారు. వైఎస్ పాలనలో పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజు సగటున 4 టీఎంసీల నీటిని ఏపీకి తరలిస్తే ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు.

Also Read: Bandi Sanjay: మున్సిపల్ ఆశావాహులకు బండి సంజయ్ వార్నింగ్.. ఫోన్ చేస్తే సీట్లు రావంటూ..!

కేసీఆర్ పాలనలోనూ తెలంగాణకు మరణ శాసనం

నీళ్ల విషయంలో పదేళ్ల కేసీఆర్ పాలనలోనూ తెలంగాణకు మరణ శాసనమైందని బండి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయి ఆనాడు కేసీఆర్ కృష్ణా జలాలను తాకట్టు పెట్టారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే ఒప్పుకుని కేసీఆర్ సంతకం చేసి దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 4.3 టీఎంసీల నుంచి ఏకంగా 13.7 టీఎంసీలకు పెంచినా కేసీఆర్ నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో పాలకుల తప్పిదాలను సరిదిద్దడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగులను ఏర్పాటు చేసింది నిజం కాదా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. అప్పటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ప్రగతి భవన్‌లో మీటింగ్ పెట్టుకుని బేసిన్లు లేవ్.. భేషజాల్లేవని మాట్లాడింది నిజం కాదా అని విమర్శించారు.

కవితకు హ్యాట్సాఫ్

కేసీఆర్ సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న కల్వకుంట్ల కవితకు హ్యాట్సాఫ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఎవరు అవినీతి, అక్రమాలు బయపెట్టినా కేంద్రం వారికి సహకరిస్తుందన్నారు. రోజా ఇంట్లో దావత్ వెనుక ఉన్న మర్మమేందో కూడా కవిత బయటపెట్టాలని సంజయ్ కోరారు. ఆనాడు రోజా పెట్టిన నాన్ వెజ్ తిని తిరుమల టూర్‌ను కూడా కేసీఆర్ రద్దు చేసుకున్నాడని బండి గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలని ఉద్యమాలు చేసిన జల్ శక్తి శాఖలో అడ్వయిజర్‌గా ఉన్న వెదిరె శ్రీరామ్‌కు బండి హ్యాట్సాఫ్ చెప్పారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.

సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయించాలి

టికెట్ ఎవరికిచ్చినా తమ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థినే గెలిపిస్తామని, సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయించాలని, టికెట్ రాకపోయినా నారాజ్ కాబోమని, కలిసికట్టుగా ప్రచారం చేసి కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నాయకులంతా ముక్తకంఠంతో నినదించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, సంక్రాంతి తరువాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి మంచి వాతావారణం ఉందని, ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారన్నారు. టికెట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. తాను ఎవరికీ టికెట్లు ఇస్తానని హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొంతమంది తన కుటుంబ సభ్యుల ద్వారా టికెట్లు కావాలంటూ ఒత్తిడి చేయిస్తున్నారని, అలాంటి వారికి టికెట్ ఇవ్వబోనని తేల్చి చెప్పారు. టికెట్ల కేటాయింపులో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలో సూచనలు ఇవ్వాలని నాయకుల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read: Bandi Sanjay: పంచాయతీలకు నిధులు.. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్

Just In

01

BMW Heroines: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. హీరోయిన్లు యమా హుషారుగా ఉన్నారుగా!

Dance Politics: డిప్యూటీ సీఎం పవన్ డ్యాన్స్‌పై అంబటి రాంబాబు హాట్ కామెంట్స్

Sanjay Dutt: మూడు రూ. 1000 కోట్ల చిత్రాలున్న ఏకైక ఇండియన్ యాక్టర్.. ‘రాజా సాబ్’ మిస్!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినెలా రూ.800 కోట్లు సేఫ్?.. ఎందుకంటే

Pawan Kalyan: హైపర్ ఆదిని సత్కరించిన పవన్ కళ్యాణ్.. విషయం ఏంటంటే?