Bandi Sanjay: ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్
Bandi Sanjay (Image Source: Twitter)
Telangana News

Bandi Sanjay: పంచాయతీలకు నిధులు.. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్

Bandi Sanjay: రాబోయే నెల రోజుల్లో రాష్ట్రంలోని గ్రామపంచాయతీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్ లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. నిధులను మంజూరు చేసిన తరువాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో నిధుల విడుదలలో జాప్యం చేస్తే కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు.

బండి ఏమన్నారంటే?

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచులను గెలిపించిన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బండి సంజయ్ ప్రకటించారు. కరీంనగర్ లోని రేకుర్తి శుభం గార్డెన్స్ లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సర్పంచ్ గిరి చేయాలంటే ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారం తప్పనిసరి అని, ఈ ముగ్గురు కలిసి ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. అందరి కృషివల్లే 108 మంది సర్పంచులను బీజేపీ మద్దతుతో గెలిచారని, దాదాపు 100 స్థానాల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచారన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేసేదే కేంద్రం

బీజేపీ సర్పంచ్ అంటే.. ఇతర గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించాలని సూచించారు. అడ్డగోలు హామీలిస్తే ఇబ్బందుల్లో పడతారని, గ్రామాల్లో మొదట చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నయాపైసా ఇవ్వలేదన్నారు. రాబోయే కాలంలో నిధులిస్తుందనే నమ్మకం కూడా లేదని బండి విమర్శించారు. అంతో ఇంతో నిధులిచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేది కేంద్రమేనన్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికల్లోకి వెళితే కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ విషయం తెలిసే పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గెలిచిన వాళ్లంతా కాంగ్రెసోళ్లేనని గంప కింద కమ్మేస్తోందన్నారు.

ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా..

బీజేపీ సర్పంచులున్న 108 గ్రామాల అభివృద్ధికి ఎంపీ లాడ్స్ తోపాటు సీఎస్సార్ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని బండి హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని, ప్రతి స్కూల్ లో టాయిలెట్లను నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అతి త్వరలో 9వ తరగతి చదివే విద్యార్ధులకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేయిస్తానని బండి హామీ ఇచ్చారు.

Also Read: Anasuya Bharadwaj: వివక్షపై మరోసారి గళం విప్పిన అనసూయ.. “నా ఉనికిని తక్కువ చేసే ప్రయత్నం చేయకండి”

అత్యాధునిక సింథటిక్ ట్రాక్ 

మరోవైపు జమ్మికుంటలో అత్యాధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బండి సంజయ్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4-లేన్ 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చిందన్నారు. ఖేలో ఇండియా పథకం కింద కేంద్రం తన వంతుగా రూ.6.50 కోట్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేంద్ర యువజన, క్రీడల శాఖల మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ చంచల్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా పాలనాపరమైన అనుమతినిస్తూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ అందిన 15 రోజుల్లోగా కేంద్రానికి ఆమోదం తెలపాల్సి ఉందన్నారు.

Also Read: Dhandoraa Movie Review: శివాజీ ‘దండోరా’ వేసి చెప్పింది ఏంటి?.. తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవండి..

Just In

01

Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!

Galaxy Watch: గెలాక్సీ వాచ్ వినియోగదారులకు శుభవార్త..

Pawan Kalyan: పవన్ ఖాతాలో మరో ఘనత.. ఏపీకి జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్

Tollywood Flops: 2025లో నిర్మాతలను నిండా ముంచేసిన టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలు ఇవే?..

Maoist Encounter: భారీ ఎన్ కౌంటర్.. టాప్ తెలుగు మావోయిస్టు నేత హతం