Dandora Movie Review: శివాజీ ‘దండోరా’ వేసి చెప్పింది ఏంటి?
dandora-review(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Dhandoraa Movie Review: శివాజీ ‘దండోరా’ వేసి చెప్పింది ఏంటి?.. తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవండి..

  • మూవీ : దండోరా
  • విడుదల: 25.12.2025
  • నటీనటులు: శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ, మౌనికా రెడ్డి తదితరులు
  • దర్శకత్వం: మురళీకాంత్
  • సంగీతం: మార్క్ కె. రాబిన్
  • నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని.

కోర్డు సినిమాలో మంగపతి పాత్రతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శివాజీ మరో సినిమా ‘దండోరా’తో మన ముందుకు వచ్చారు. విడుదలకు మందు సినిమాకు మంచి ప్రచారం జరిగినా ప్రీరిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిగ్ గా మారాయి. ఈ సినిమాలో స్టార్ పవర్ కూడా బలంగా ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు కూడా బాగా ఉన్నాయి. నవదీప్, నందు, బిందు మాధవి, తదితరులు ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

Read also-Allu Arjun: మళ్లీ అల్లు అర్జున్‌తోనే ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీపై క్లారిటీ!

కథా నేపథ్యం

Dhandoraa Movie Review: 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (మెదక్ జిల్లా)లోని ఒక గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఆ ఊరిలో కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్రకులానికి చెందిన శివాజీ తన కులం గౌరవమే ప్రాణంగా బతుకుతుంటాడు. అయితే అతని కూతురు సుజాత (మౌనిక), అదే ఊరికి చెందిన తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన కుల పెద్దలు పరువు కోసం రవిని చంపేస్తారు. ఆ బాధతో సుజాత కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. తన కళ్ళ ముందే కూతురు చనిపోవడంతో శివాజీలో ఎలాంటి మార్పు వచ్చింది? తన పంతం వల్ల కుటుంబాన్ని ఎలా కోల్పోయాడు? ఆ తర్వాత బిందు మాధవి పాత్ర ద్వారా అతని జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేదే ఈ సినిమా మిగిలిన కథ.

విశ్లేషణ

షెడ్యూల్ కులానికి చెందిన ఓ వృద్ధురాలి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లే సీన్‌తో సినిమా మొదలవుతుంది. 2004 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కథంతా సాగుతుంది. మొదటి భాగం అంతా కులం గొడవలు, రవి-సుజాతల లవ్ స్టోరీతో సాగుతుంది. కులం గొడవలు అంటే కచ్చితంగా ఎవరో ఒకరు చావాల్సిందే.. అలా ఓ హత్యతో విరామం కార్డ్ పడుతుంది. సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కులం కాన్సెప్ట్‪‌పై తీసిన సినిమాల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి మనోవేదన అనుభవిస్తారనే విషయాన్ని చూపించారు. ఇందులో మాత్రం హత్యకు కారణమైన వ్యక్తి, అతడి కుటుంబం ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుంది అనే అంశాన్ని చూపించారు. క్లైమాక్స్‌ని కూడా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ముగించారు. స్టోరీకి అవసరం లేని సీన్స్ కూడా చాలానే ఉంటాయి. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసె విధంగా ఉంటాయి.

Read also-Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

నటీనటుల ప్రతిభ

దండోరా సినిమాతో ‘90’s’ వెబ్ సిరీస్, ‘కోర్ట్’ సినిమాల తర్వాత శివాజీ మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. ఒక క్రూరమైన కుల అహంకారిగా, ఆ తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోయే తండ్రిగా ఆయన నటన సినిమాకు ప్రధాన బలం. సర్పంచ్ పాత్రలో నవదీప్ ‘2.0’ వెర్షన్ కనిపిస్తుంది. చాలా సెటిల్డ్ గా, తన నటనతో సినిమాకు గంభీరతను తెచ్చారు. ప్రేమికులుగా రవికృష్ణ, మణికల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా రవికృష్ణ చిరంజీవి అభిమానిగా మంచి ఎనర్జీ చూపించారు. ఒక వేశ్య పాత్రలో బిందు మాధవి నటన హుందాగా ఉంది. శివాజీ పాత్రలో మార్పు రావడానికి ఆమె పాత్ర కీలకంగా నిలుస్తుంది. శివాజీ కొడుకు విష్ణుగా నందు తన కెరీర్‌లో అత్యుత్తమ పాత్రను పోషించారు. తండ్రిని అసహ్యించుకునే కొడుకుగా తన మెచ్యూరిటీని ప్రదర్శించారు.

సాంకేతిక అంశాలు

దర్శకుడు మురళీకాంత్ ఎంచుకున్న పాయింట్ కొత్తది. సాధారణంగా సినిమాల్లో తక్కువ కులం వారు బాధితులుగా చూపిస్తారు, కానీ ఇక్కడ బాధితుడు అగ్ర కులానికి చెందిన శివాజీ కావడం ఒక కొత్త కోణం. మార్క్ కె. రాబిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. పాటల కంటే రీ-రికార్డింగ్ చాలా బాగుంది. వెంకట్ ఆర్. శాఖమూరి 2004 నాటి తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా కెమెరాలో బంధించారు.

బలాలు
స్టోరీ
క్లైమాక్స్

బలహీనతలు
సెకండాఫ్‌లో సాగదీత

రేటింగ్ – 2.75 / 5

Just In

01

Prabhas RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి మ్యూజికల్ సర్‌ప్రైజ్.. క్రిస్మస్ ట్రీట్ అదిరిందిగా..

Uttar Pradesh: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు.. టీచర్ మృతి

Bandi Sanjay: పంచాయతీలకు నిధులు.. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్

Google Search Trends 2025: గూగుల్ సెర్చ్ 2025లో అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?..

School Bus Accident: మరో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. 60 మందికి పైగా విద్యార్థులు..!