Anasuya Bharadwaj: ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా మరోసారి తన గళాన్ని వినిపించారు. ఇటీవల శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో, ఆమె సమాజంలోని పితృస్వామ్య ధోరణులపై, మీడియా బాధ్యతపై తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న భావాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే శివాజీ బహిరంగంగా వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. అయినా సరే ఈ చర్చలు ఆగడం లేదు. తాజాగా దీనపై ట్విటర్ లో వార్ జరుగుతోంది. శివాజీ వ్యాఖ్యలకు కొంతమంది మహిళలే మద్దతు పలుకుతుంటే, కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.
Read also-Dandora Movie Review: శివాజీ ‘దండోరా’ వేసి చెప్పింది ఏంటి?.. తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవండి..
“వయసును అస్త్రంగా వాడుకుంటున్నారు”
కొంతమంది పురుషులు, అలాగే కొంతమంది మహిళలు కూడా తన వయసును ప్రస్తావిస్తూ తనను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్వతంత్ర భావాలు కలిగిన ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఒక రకమైన అభద్రతా భావం ఉందని ఆమె పేర్కొన్నారు. “మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం, బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని సంతృప్తి పరుచుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి విమర్శలు వస్తున్నాయి” అని ఆమె స్పష్టం చేశారు.
Read also-Vishnu Manchu: శివాజీ ఇష్యూపై నిర్ణయాత్మకంగా వ్యవహరించిన ‘మా’ అధ్యక్షుడు.. ఏం చేశారంటే?
‘మార్పు మన నుంచే మొదలవ్వాలి’
ఈ పోరాటం ఎవరికో వ్యతిరేకం కాదని, కేవలం ఆలోచనా విధానం మారాలని ఆమె కోరారు. పాత తరాల నుంచి వచ్చిన సంకుచిత ఆలోచనలను మనం అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు కించపరచుకోవడం మానేసి, శక్తినివ్వాలి, మద్దతుగా నిలవాలి. మన గౌరవం, స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉన్నాయి. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది. ఇదే క్రమంలో మీడియా పనితీరుపై కూడా అనసూయ ఘాటుగా స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలను లేదా పాతకాలపు ధోరణులను మహిమాపరచడం ఆపాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. చివరిగా, తన ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ ఆమె ఒక పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మీరు మీ అసూయను అలాగే ఉంచండి.. నేను నా వైభవాన్ని ఇలాగే కొనసాగిస్తాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజం కోసం గట్టిగా నిలబడతానని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Inkokkati last chepta eerojuki.. unna issue ni address cheyatam chaatakaka nannu age shame chestu aunty antunna men and women.. aayanni maatram garu antunnaru.. kani nenu hypocrite ni aipoyanu 😄 naku 40.. aayanaki 54 anukunta.. aina iddaram chakkaga ma profession kosamo personal…
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025

