CM Revanth Reddy
Politics

CM Revanth Reddy: ఆ 10 నియోజకవర్గాల గురించే చర్చ.. అసంతృప్తి దూరం చేసేందుకేనా?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: CM Revanth Reddy: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా శాసన సభ్యులకు ప్రయారిటీ పెంచాలని భావిస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ప్రతినిత్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో నిధులు కేటాయించాలని ఆలోచిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆయా ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలోనూ ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్ లోనూ మరిన్ని నిధులు అందజేస్తానని హామీ ఇచ్చారు. బడ్జెట్ సెషన్స్ పూర్తైన తర్వాత బీఆర్ ఎస్ నుంచి చేరిన శాసన సభ్యుల నియోజకవర్గాల్లోనూ సీఎం పర్యటించనున్నట్లు తెలిసింది.

ఆయా సెగ్మెంట్ల డెవలప్ కు కృషి చేయనున్నారు. భద్రాచలం, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, జగిత్యాల, పటాన్ చెరు, బాన్సువాడ, గద్వాల్, నియోజకవర్గాల పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఇప్పటికే ఉన్నతాధికారులకూ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. బడ్జెట్ సెషన్స్ ముగియగానే తర్వాత షెడ్యూల్ ఈ సెగ్మెంట్ల పర్యటనలే ఉంటాయని కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నేత చెప్పారు.

also read: CM Revanth Reddy: సందేహం వద్దు సోదరా.. ప్రజామద్దతు మాకే.. సీఎం రేవంత్ రెడ్డి

ఆ పది నియోజకవర్గాల్లో అన్ని సమకూరాలే…?
బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన నియోజకవర్గాల్లో రోడ్లు, భవనాలు, స్కూల్స్, డ్రైనేజీ, తాగు, సాగు నీరు, ప్రభుత్వ పథకాలు చేర వేయడం వంటివి వేగంగా అందించేందుకు ప్రయారిటీగా తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ఇందుకు సంబంధించిన ఎస్టిమెషన్లను కూడా రెడీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా హయ్యర్ ఆఫీసర్లకు ఆదేశాలు వెళ్లాయి. అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి చేరామనే సంకేతాన్ని పంపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్లో కొందరు అసంతృప్తితో పాటు మనోవేదనకు గురవున్నారనే ప్రచారం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిళ్లలోనూ చర్చంశనీయంగా మారింది.

పైగా కాంగ్రెస్ లోకి ఎందుకు చేరారనే విషయాన్ని కూడా ఆయా ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలు, ఫాలోవర్స్ కు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉన్నది. దీంతో ఆ ఎమ్మెల్యేల్లో కొందరు డీ మోరల్ కూడా అవుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. గతంలో ఇతర పార్టీల నుంచి అప్పటి అధికార పార్టీ బీఆర్ ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా, డెవలప్ మెంట్ కోసమే మారామని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే సీన్ రిపిట్ కానున్నది.

also read: Rajiv yuva vikasam Scheme: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 3 లక్షలు పొందే స్కీమ్ గురించి మీకు తెలుసా!

గతంలో భారీగా చేరికలంటూ ప్రచారం..?
మరోవైపు చేరికలపై కోర్టుల్లో కేసు కూడా నడుస్తుంది. తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని బీఆర్ ఎస్ బలంగా నమ్ముతుండటంతో పాటు ప్రచారం కూడా చేస్తుంది. దీంతో కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలు డైలమోలో పడుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అని ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. పైగా కొత్త జాయినింగ్స్ వంటివి కూడా ఏమీ లేవు. గతంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చేరతారనే ప్రచారం విస్తృంతంగా జరిగింది.

కానీ ఇక ఇప్పట్లో చేరికలు లేవనే విషయాన్ని తెలుసుకున్న బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఇదే తరహాలో వ్యవహరించగా, సీఎం నేరుగా ఆ నియోజకవర్గంలో పర్యటించారనే ప్రచారం విత్ ఇన్ ది పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇక పటాన్ చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ను బూతులు తిట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిశారు.

మరోవైపు మంత్రి పదవి వస్తుందని భావించిన దానం నాగేందర్ కు నిరాశే మిగిలింది. పైగా సికింద్రాబాద్ ఎంపీగా టిక్కెట్ ఇచ్చి పోటీ చేయించడంతో లీగల్ సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. బండ్ల కృష్ణ మోహన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్ లు కూడా బీఆర్ ఎస్ తో ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ ను మెయింటెన్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ పరిశీలించిన ప్రభుత్వం ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై సీరియస్ గా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని భావిస్తుంది. బడ్జెట్ సెషన్స్ తర్వాత సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఆ షెడ్యూల్ లో ఈ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రూపొందించాలని పార్టీ నుంచి ఆదేశాలున్నట్లు తెలిసింది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు