CM Revanth Reddy: తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఫస్ట్ టైమ్ బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ కు ఓటు వేశారని, సెకండ్ టర్మ్ లో తమపై ప్రేమతో ఓట్లు వేస్తారని సీఎం వెల్లడించారు. ఇప్పటి వరకు తాను చెప్పిందంతా నిజమైందని, భవిష్యత్ లోనూ అదే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
శనివారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. తమ పని చేసుకుంటూ ముందుకు సాగుతామని, ఎవరిని విమర్శలకు భయపడేది లేదన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అంటూ వివరించారు. ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం నిలపెట్టుకుంటుందన్నారు. తనకు స్టేచర్ ముఖ్యం కాదని, ప్రజల ఫ్యూచర్ మాత్రమే నని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25 లక్షలకు పైగా కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు.
అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నా, రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి కింద పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇక త్వరలో కోటి మంది మహిళలకు తప్పనిసరిగా లబ్ధిని చేకూరుస్తామన్నారు. రైతులు, యువత, మహిళలంతా తమకే ఓటేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. పేదలకు పరిపుష్టిగా ఆర్ధిక, సంక్షేమంగా బలోపేతం చేసే వరకు తాను నిర్వీరామంగా కృషి చేస్తానని నొక్కి చెప్పారు.
ఇక జనాభా లెక్కల గురించి జిల్లా కలెక్టర్లను కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగిందని, 2026లో పూర్తి చేసి 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారనే అంచనా ఉన్నదన్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం డిలిమిటేషన్ కు సమాయత్తమవుతుందన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ ప్రయత్నాలు చేస్తుందన్నారు.
Also Read: Congress vs BRS Party: ప్లాన్ ప్రకారమే వాకౌట్? బీఆర్ఎస్ ప్లాన్ ఫలించిందా?
దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకం చేసేందుకు చొరవ తీసుకుంటామన్నారు. ఇప్పటికే తమ ఎంపీలు సంప్రదింపులు చేస్తున్నారని వివరించారు. జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ స్టేట్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. నార్త్ స్టేట్స్ కు భారీగా నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. వీటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు