CM Revanth Reddy: మామ అల్లడు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవు. పిసి ఘోష్ నివేదిక పై అసెంబ్లీ చర్చకు పెట్టాం చర్చ తర్వాత తగిన చర్యలు ఉంటాయనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి పరిశీలించెందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి సహా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Also Read: Rajanna Sircilla: వరదలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉక్కిరి బిక్కిరి.. వాగులో చిక్కుకున్న రైతులు!
ప్రాజెక్టును సందర్శించిన సీఎం
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి నదికి చీరే సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిరవించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు గుండెకాయ అన్నారు. పీసీ ఘోష్ నివేదిక పై అసెంబ్లీ చర్చకు పెట్టామన్నారు. మామ అల్లడు ఎన్ని కుట్రలు చేసిన వారు చేసిన పాపాలు పోవు. ముందు వెనక ఆలోచించకుండా నీళ్లు నింపుతే గ్రామాలే కొట్టుకపోతాయి. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తున్నామన్నారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్ లో లోపాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది. డిజైన్లు,నిర్మాణం, నిర్వహణ లోపం ఉందన్నారు.
Also Read: BRS leaders join Congress: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సీనియర్ నేతల ఎంట్రీ