Rajanna Sircilla: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలతో రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla) ఉక్కిరి బిక్కిరి అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla) గంభీరావుపేట మండలం నర్మాల వాగులో ఒక పశువుల కాపరి సహా ఐదుగురు రైతులు చిక్కుకున్నారు. వారిని ఆర్మీ హెలికాప్టర్స్ ద్వారా అధికారులు రక్షించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మానేరు వాగులో ప్రవీణ్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. ప్రవీణ్ ను ఎన్టీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా నర్మాల వాగుపొంగిపొర్లడంతో పశువుల కాపరి జంగం స్వామితో సహా ఏడుగురు ఉదయం 7 గంటలకు వాగులోని ఒక ద్వీపం లాంటి ప్రదేశంకు చేరుకున్నారు. వాగు ఉదృతి పెరుగుతున్న విషయం గమనించిన ఒక్కరు బయట పడగా బయట పడేందుకు ప్రయత్నించిన మరొకరు వాగులో గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. పశువుల కాపరి సహా మరో నలుగురు అక్కడే చిక్కిపోయారు.
Also Read: Viral Video: రూ.200 కోట్ల బంగ్లాలో.. వీధి కుక్కకు చోటిచ్చిన షారుక్.. మనసు గెలిచేశాడు భయ్యా!
ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. బుధవారం సాయంత్రం ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మానేరు వాగులో ప్రవీణ్ అనే వ్యక్తి చిక్కుకు పోయాడు. ఎన్టీఆర్ఎఫ్ బృందం రిస్క్ చేసి చిక్కుకుపోయిన ప్రవీణ్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వరదలో చిక్కుకు పోయిన వారికి బరోసా నింపి వారిని కాపాడేందుకు కృషి చేసిన అధికారులను ప్రజలు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. మరోవైపు జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయ బృందాలు నిత్యం పర్యవేక్షణ పెంచాయి. అవసరమైన మేరకు ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు.
హెలికాప్టర్ చూసిన తరువాతే మాకు ప్రాణాలు లేచి వచ్చాయి
వాగులో ఇరుక్కుపోయి సురక్షితంగా బయట పడ్డవారు మాట్లాడుతూ వారు రాత్రి సమయంలో పడ్డ తిప్పలు వివరించారు. తమ చుట్టూ వరదలు పెరుగుతుండటం ఒకవైపు ప్రాణాల మీద ఆశ లేకుండా చేస్తుంటే… ఆహారం, నీరు లేకుండా 24 గంటలకు పైగా బిక్కు బిక్కు మంటూ గడిపాం అన్నారు. ఇక మేము బ్రతకలేమని అనుకుంటుండగా రెస్క్యూ హెలికాప్టర్ కనిపించడంతో మళ్ళీ మాకు ప్రాణాలు లేచి వచ్చాయి. హెలికాప్టర్ వచ్చిన తర్వాతే మాకు మళ్ళీ ప్రాణాలపై ఆశ కలిగింది అన్నారు.
వరద లో చిక్కుకున్న బాధితులు క్షేమం
వరదలో చిక్కుకున్న బాధితులు క్షేమంగానే ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వరదలో బాధితులు చిక్కుకున్న విషయం తెలుసుకున్న ఆయన సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలను పర్యవేక్షించారు. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో వారు సురక్షితంగా బయట పడ్డ బాధితులను తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించారు.
బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వరదల్లో గల్లంతు అయిన నాగయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. వారి కుటుంబనికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అధికారులను అభినందించిన కేంద్ర మంత్రి బండి
వాగులో చిక్కుకుపోయిన బాధితులకు ధైర్యం నింపి రాత్రంతా వారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సహా స్థానిక అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. సంఘటన స్థలం చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ వరదల చిక్కుకుపోయి బాధితులు ఇబ్బంది పడుతుందనే పద్యంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సమాచారంతో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లకు ఫోన్ చేసి విషయం వివరించడంతో వెంటనే ఆర్మీ హెలికాప్టర్ సమకూర్చారన్నారు. ప్రకృతి ఉపద్రవాలు సంభవించిన సమయంలో పార్టీలకతీతంగా ప్రజలను రక్షించేందుకు కలిసికట్టుగా అందరూ పనిచేయడం అభినందనీయం అన్నారు. అధికారులను శాలువాలతో ఆయన సన్మానించారు.
Also Read: PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సంచలనం