KTR CM Ramesh
Politics

CM Ramesh: కేటీఆర్.. మతి ఉండే మాట్లాడుతున్నావా?

CM Ramesh: రాజకీయాల్లో ఈ మధ్య అర్థం పర్థం లేని ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముందు నోటికొచ్చింది ఏదో ఒకటి మాట్లాడడం, తర్వాత చిక్కుల్లో పడడం కామన్ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న లక్ష్యంతోవ ఏదిబడితే అది మాట్లాడుతున్నారు. అయితే, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు

ఆ మధ్య వివాదాస్పదమైన సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి తాజాగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి మద్దతిచ్చి కమీషన్లు ఇప్పించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు భారీ లబ్ధి జరుగుతున్నదని అన్నారు. ఫోర్త్ సిటీలో వందల కోట్ల కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దాదాపు రూ.16 వందల కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులు దక్కాయని, అంతా క్విడ్ ప్రోకో గా జరుగుతున్నదని విమర్శలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చేనీయాంశంగా కాగా సీఎం రమేష్ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

నాకేం సంబంధం లేదు

అనకాపల్లిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రమేష్, కేటీఆర్ కాంట్రాక్టులు దక్కాయని చెబుతున్న రిత్విక్ కంపెనీకి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రూ.1,660 కోట్ల కాంట్రాక్ట్ పనులకు సంబంధించి తనపై ఆరోపణలు చేయడం మూర్ఖత్వమేనని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తాను కాంట్రాక్ట్ పొందాను అనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. సదరు కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

చెల్లి పోరుతో మతి పోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెల్లి షర్మిలతో పోరు ఉన్నట్టే తెలంగాణలో కేటీఆర్‌కు కవితతో ఉన్నదని, అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారని సీఎం రమేష్ సెటైర్లు వేశారు. తెలంగాణలో ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు పనుల కాంట్రాక్టులు వచ్చి 3 నెలల అయిందని, అసలు ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పాటిస్తుందో పదేళ్లు మంత్రిగా చేసిన మీకు తెలియదా అంటూ చురకలంటించారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం

మాటల సందర్భంలో సీఎం రమేష్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 4 నెలల క్రితం ఢిల్లీలో తన ఇంటికి వచ్చిన కేటీఆర్ వచ్చారని, ఆ సమయంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన విషయం మర్చిపోయారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తావా అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు.

Read Also- Sunjay Family: సుంజయ్ కపూర్ ఫ్యామిలీలో ‘రూ.30 వేల కోట్ల’ చిచ్చు

టీడీపీతో పొత్తు సమయంలో ఎలా గెలిచావో తెలియదా?

టీడీపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో బయటపెట్టాలా అంటూ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసిందని నేను అడిగినప్పుడు, ‘‘మా పార్టీకి కమ్మ నా *డుకులు అవసరం లేదని, మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాలకు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తున్నాం’’ అని నాతో చెప్పావా లేదా అని అడిగారు. తెలంగాణలో కూడా ఏపీలో మాదిరిగా కూటమి ఏర్పాటు అవుతుందని, అప్పుడు బీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మీ కాంట్రాక్టుల సంగతేంటి?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు రూ.7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు, అవి ఎవరెవరికి ఇచ్చారు, అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది, ఆంధ్రా వాళ్లు ఎంతమంది అనేది తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని సీఎం రమేష్ చెప్పారు. దమ్ముంటే మీడియా సమక్షంలో చర్చిద్దాం రండి అంటూ సవాల్ చేశారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనవసరంగా తన జోలికొస్తే, బీఆర్ఎస్ బండారం మొత్తం బయటపెడతానని స్పష్టం చేశారు.

Read Also- PM Modi: ప్రధాని మోదీపై తాజా ప్రజాభిప్రాయం ఇదే

Just In

01

Bigg Boss Telugu 9: ఓవర్ కాన్ఫిడెంట్ పేరుతో రగులుతోన్న హౌస్.. గౌరవ్, భరణిలకు దివ్య ఇచ్చిపడేసింది

Cyclone Montha Live Updates: దూసుకొస్తున్న మెుంథా తుపాను.. ఏపీలో అల్లకల్లోల పరిస్థితులు.. ఆర్మీని దించుతామన్న లోకేశ్

Adluri Laxman Kumar: గిరిజన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Delhi Acid Attack: దిల్లీ యాసిడ్ దాడి ఘటన.. క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ట్విస్టులు.. ఫ్యూజులు ఎగరడం పక్కా!

Bihar Manifesto: ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ జాబ్.. తేజశ్వి యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల