Legislative Council: తెలంగాణ శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభం కాగానే బీఆర్ఎస్(BRS) సభ్యులు కాళేశ్వరంపై సీబీఐ(CBI)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కొద్దిసేపు గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ ఆందోళన చేపట్టారు. దీంతో శాసనమండలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక పేపర్లు చింపి మండలి చైర్మన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutha Sukender Reddy).. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయొద్దని.. వారికి కేటాయించిన స్థానాల్లోనే నిరసన వ్యక్తం చేయాలని గుత్తా సూచించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనలతో శాసనమండలి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Mahabubabad District: సీసీ నిఘాతో నిందితులకు దడ దడ.. సిఐ మహేందర్ రెడ్డి
మూడు బిల్లులకు మండలి ఆమోదం
శాసనమండలి ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన సమయంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి ఆమోదం తెలిపారు. అదేవిధంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టసవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చలేకుండానే ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
మంత్రి సీతక్క ఫైర్
శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులఆందోళనపై మంత్రి సీతక్క(Min Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్(BRS)కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో టీఆర్ఎస్ బంధం తెగిపోయిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టీఆర్ఎస్‌కు తెలంగాణ మాట పలికే అర్హత కోల్పోయిందని మండిపడ్డారు.
Also Read: Star Actress: క్యాన్సర్‌తో ప్రముఖ నటి కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ!