Harish Rao (imahecredit:swetcha)
Politics

Harish Rao: వారికి పంపకాలపై దృష్టి ప్రజలపై పట్టింపు లేదు: హరీష్ రావు

Harish Rao: పంపకాల్లో మంత్రుల మధ్య తన్నులాట జరుగుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ది ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అని దుయ్యబట్టారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వడ్డెర సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం వడ్డెర సమాజానికి సహాయం చేసిందని, సిద్దిపేటలో ట్రాక్టర్లు అందజేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే వడ్డెరలపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో బిల్డింగులు నిర్మించేవాళ్లకు చేతి నిండా కూడా పని దొరికేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవడం లేదని, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందన్నారు.

సంపూర్ణమైన బాధ్యత

కేసీఆర్(KCR) హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాడని, కాంగ్రెస్(Congress) సర్కార్ మాత్రం లక్ష ఇండ్లను కూలగొట్టిందని మండిపడ్డారు. పేదల ఇండ్లు కూల్చదంటే, హైడ్రా(Hydraa) బంద్ కావాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలని కోరారు. తాను కేటీఆర్(KTR), కేసీఆర్‌(KCR)తో మాట్లాడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. మీరు అడగకపోయినా హైదరాబాదులో వడ్డెర సంఘానికి ఎకరం భూమిని కేసీఆర్ ఇచ్చారన్నారు. నిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కిట్టు(KCR Kitt), బతుకమ్మ చీర, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ అన్ని పథకాలకు కాంగ్రెస్ కత్తెర పెట్టిందన్నారు. భర్త చనిపోతే ఏడ్చిన ఆడపడుచు సునీతని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారని మండిపడ్డారు. కారు మీద ఓటు గుద్దితే కాంగ్రెస్ గువ్వ గుయ్ మనాలన్నారు.

Also Read: Kavith On BRS: బీఆర్ఎస్‌లో ఎంతో కష్టపడ్డా.. రావాల్సిన గుర్తింపు రాలేదు.. జనం బాటలో కవిత ఆవేదన

మైనార్టీలకు నాణ్యమైన విద్య..

గురుకుల పాఠశాలలు పెట్టి మైనార్టీలకు కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించారని హరీశ్ రావు పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్‌లో సీటు పొందిన మైనారిటీ గురుకుల విద్యార్థులను ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల వల్ల మైనార్టీలకు ఎంత లాభం జరిగిందనేది మీకే బాగా తెలుసన్నారు. మైనార్టీ వెల్ఫేర్ స్కూల్‌లో చదివి తల్లిదండ్రులకు, కేసీఆర్ కలను నిజం చేసిన మిమ్మల్ని సన్మానించం సంతోషంగా ఉందన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారన్నారు. అంతకు మించిన ఆనందం తల్లిదండ్రులకు ఉండదని, అందులో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు మేము ఎంతో సంతోష పడుతున్నామన్నారు.

Also Read: Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Just In

01

Spring Onions Benefits: ఉల్లికాడ‌ల‌ వలన ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

MLC Kavitha: త్వరలో వారి చిట్టా బయటపెడతా అంటూ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!

KTR: తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: కేటీఆర్