Kavith On BRS: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత తలపెట్టిన ‘జనం బాట’ (Janam Bata) కార్యక్రమం నిజామాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోని జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవితకు.. శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహిళలు తమ నృత్యాలతో ఆహ్వానం తెలిపారు. అటు తెలంగాణ తల్లి వేషధారణలో చిన్నారులు కనిపించి ఆకట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)పై మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారు.
కవిత ఏమన్నారంటే?
నిజామాబాద్ జాగృతి కార్యాలయం (Nizamabad Jagruti office)లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నీడ నుంచి తనను దూరం చేశారని పేర్కొన్నారు. దీంతో తన దారి తాను వెతుక్కుంటున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని కవిత కోరారు. ‘4-5 నెలలుగా రక రకాల రాజకీయ పరిణామాల వల్ల ఇక్కడికి రాలేకపోయాను. చాలా ఏళ్లు ఉద్యమం కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశాను. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు గుండెల మీద చేతులు వేసి ఆలోచన చేయండి. నిజామాబాద్ లో సొంత పార్టీ నేతల కుట్ర వల్లే ఓడిపోయా. పార్టీలో నాకు సరైన గుర్తింపు దక్కలేదు. కుట్రపూరితంగా సస్పెండ్ చేశారు. మళ్లీ ప్రజల్లోకి రావాలనుకున్నా. ఇందుకు తొలి అడుగు నిజామాబాద్ నుంచి మొదలు పెడుతున్నా. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు కోసం పోరాడాల్సిన అవసరం రాష్ట్రంలో ఉంది’ అని కవిత అన్నారు.
రూ.కోటి ఇవ్వాలని డిమాండ్..
అంతకుముందు నిజామాబాద్ బయలుదేరే ముందు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్దకు కవిత వెళ్లారు. అక్కడి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలని తెలంగాణ జాగృతి తరపున కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది అమరులైన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరుల ఆశయాలు ఏమేరకు నెరవేరాయో పునరాలోచించాల్సిన అవసరముందని కవిత వ్యాఖ్యానించారు.
జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరులస్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
కవిత గారు మాట్లాడుతూ…
• తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం
• ఏ ఆశయాల కోసం వారు… pic.twitter.com/OHJk5uhwOb
— Telangana Jagruthi (@TJagruthi) October 25, 2025
Also Read: Sleeper Bus Fire Accidents: దశాబ్ద కాలంలో జరిగిన స్లీపర్ బస్ యాక్సిడెంట్స్.. కర్నూలు ఘటనకు మించిన విషాదాలు!
కవిత ప్రత్యేక పూజలు..
ఇదిలా ఉంటే తొలుత నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న కవిత.. తన కాన్వాయ్ దేవితండా వద్ద ఆపారు. అక్కడి జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను ఆమె సందర్శించారు. దేవీ, దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న కవితకు జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా తిరిగి నిజామాబాద్ లో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా చేరుకున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.#JagruthiJanamBaata pic.twitter.com/CW6wWslzzt
— Telangana Jagruthi (@TJagruthi) October 25, 2025
