Maganti Sunitha: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి సునీత మాగంటిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకైక చట్టబద్ధమైన కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రధుమ్న కోసరాజు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. సునీత మాగంటి గోపీనాధ్ తో లివింగ్ రిలేషన్స్ లో మాత్రమే ఉండదని, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన లేఖలో సునీత తప్పుడు సమాచారం సమర్పించారని, అసలు విషయాలను ఆమె దాచిపెట్టారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. మాగంటి గోపీనాథ్ జూబిలీ హిల్స్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన 2025 జూన్ 8న మరణించారని, గోపీనాధ్ కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రధుమ్న గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కోసరాజు మాలిని దేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Jubilee Hills By Election: ఊహించని రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు..!
ఏకైక చట్టబద్ధ కుమారుడినని తారక్
ఈ వివాహ బంధం ఆయన మరణం వరకు కొనసాగిందని, ఎలాంటి డివోర్స్ లేవని, తాను వారి ఏకైక చట్టబద్ధ కుమారుడినని తారక్ చెప్పారు. సునీత మగంటి గోపీనాథ్‌తో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారని, తనను గోపీనాధ్ చట్టబద్ధ భార్యగా, తన పిల్లలను చట్టబద్ధ వారసులుగా తప్పుగా చూపారని తారక్ ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 125 ఏను ఉల్లంఘించినట్టు అవుతుందని తారక్ వాదిస్తున్నారు. ఈ ఆరోపణలకు మద్దతుగా, రాజేంద్రనగర్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీఓ) 2025 అక్టోబర్ 11న జారీ చేసిన ఆర్డర్‌ను (రిఫరెన్స్ నెం. సి/2100/2025) జతచేశారు. ఈ ఆర్డర్‌లో సునీత తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందారని, గోపీనాథ్ మొదటి వివాహ విషయాలను దాచిపెట్టారని తారక్ పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌కు ఈ లేఖలో అఫిడవిట్ ధృవీకరణ చేయాలి
దీంతో ఆ సర్టిఫికెట్‌ను (నెం. సి/08/2025-262, తేదీ 04.07.2025) రద్దు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సునీత గోపీనాథ్ చట్టబద్ధ భార్య కాదని ఆర్‌డీఓ ధృవీకరించినా, తాను గోపీనాథ్ భార్యనేనంటూ ఆమె చెప్పుకోవటం చట్టరీత్యా తప్పుగా తారక్ వ్యాఖ్యానించారు. తారక్ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఈ లేఖలో అఫిడవిట్ ధృవీకరణ చేయాలని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆమెపై చర్యలు తీసుకుని, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అవసరమైతే హైదరాబాద్‌కు వచ్చి సహకరిస్తానని చెప్పారు.ఆర్‌డీఓ ఆర్డర్, తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల వివాహ ఫోటోలు (1998), తన బర్త్ సర్టిఫికెట్ లను కూడా తారక్ ఫిర్యాదుతో జతపరిచారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాగా, మగంటి సునీత వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. తారక్ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఆమె నామినేషన్ల ఆమోదం!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్తిగా మాగంటి సునీత రెండు దఫాలుగా దాఖలు చేసిస నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్ వాటిని ఆమోదించినట్లు సమాచారం. ఇంకా నామినేషన్ల పరిశీలన ప్ర్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే గోపీనాథ్ ఏకైక చట్టబద్ధమైన కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ అమెరికా నుంచి చేసిన ఫిర్యాదులను కూడా స్వీకరించిన ఎలక్షన్ వింగ్ ఆఫీసర్లు పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ వ్యవహారంపై గురువారం అధికారికంగా క్లారిటీ రానుంది.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి సునీత మాగంటి అభ్యర్థిత్వం న్యాయపరమైన చిుక్కుల్లో పడనుందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఆమె వచ్చిన ఆరోపణలు, ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన సమాచారంపై వంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకైక చట్టబద్ధమైన కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రధుమ్న కోసరాజు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు సునీత మాగంటిని లేటెస్టుగా మరో అఫిడవిట్ ను సమర్పించాలని సూచించినట్లు తెలిసింది. తాజాగా ఆఫిడెవిట్ ను ఆధారంగా చేసుకున్న ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రస్తుతానికి ఆమె దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ ను ఆమోదిస్తూనే, సునీత మాగంటి గోపీనాధ్ భార్యేనా? కాదా? అన్న విషయాన్ని న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని తారక్ కు సూచించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సునీత
కలిసే జీవిస్తున్న మాగంటి సునీత కూడా తన భార్య కాదన్న విషయంపై కోర్టును ఆశ్రయించిన మాగంటి గోపీనాథ్ కోర్టు కేసు కీలక దశలో ఉన్నపుడు తీవ్ర మానసిక వత్తిడికి గురై హాస్పిటల్ లో చేరి, మృతి చెందినట్లు సమాచారం. దీంతో పిటిషనర్ మృతి చెందటంతో కేసును కోర్టు కొట్టివేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సునీత పోటీని అడ్డుకునేందుకు తారక్ చేసిన ప్రయత్నాలు ఒకరకంగా ఇప్పటికిపుడే ఎఫెక్టు అయ్యేలా లేకపోవటంతో ప్రస్తుతం అమెరికాలోనున్న తారక్ హిందూ మ్యారేజేస్ యాక్టును బేస్ చేసుకుని, తారక్ తల్లిని గోపీనాధ్ చట్టబద్దంగా వివాహాం చేసుకున్న అంశంతో పాటు ఆరోపణలకు మద్దతుగా, రాజేంద్రనగర్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీఓ) 2025 అక్టోబర్ 11న జారీ చేసిన ఆర్డర్‌తో సునీత తీసుకున్నతప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో తారక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి.
తారక్ హైదరాబాద్ కు వస్తారా?
దీంతో సునీత కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని కాపాడుకునేందుకు తారక్ కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయక తప్పని పరిస్థితులున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘానికి ఆమె తప్పుడు సమాచారాన్ని సమర్పించారంటూ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరిన తారక్ అవసరమైతే తాను అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తానని కూడా ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే తారక్ హైదరాబాద్ కు వస్తారా? ఆయన వచ్చే నాటికల్లా ఇక్కడ పరిస్థితులెలా ఉంటాయి? ఉప ఎన్నిక ముగుస్తుందా? లేక అంతకన్నా ముందే తారక్ వస్తారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
