Jubilee Hills By Election (imagecredit:swetcha)
తెలంగాణ, హైదరాబాద్

Jubilee Hills By Election: ఊహించని రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు..!

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణకు ఇంకా కేవలం ఒక రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. ఆది, సోమవారాలు పండుగ సెలవులు రావడంతో, నామినేషన్ల సమర్పణకు అక్టోబర్ 21న (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. గత నెల 30న జారీ అయిన షెడ్యూల్ ప్రకారం, ఈనెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

నామినేషన్ల స్వీకరణలో 6వ రోజైన శనివారం కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. షేక్‌పేటలోని తహశిల్దార్ ఆఫీసులోని రిటర్నింగ్ ఆఫీసర్ పి. సాయిరాం(Sairam) కార్యాలయంలో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 31 మంది అభ్యర్థులు మొత్తం 48 నామినేషన్లను సమర్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. బీఆర్ఎస్(BRS) అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) శనివారం మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ తరపున పి. విష్ణువర్ధన్ రెడ్డి(P. Vishnuvardhan Reddy) కూడా నామినేషన్ సమర్పించారు.

Also Read: Gadwal District: మగవాళ్లకు పౌష్టికాహారంపై అవగాహన అవసరం: కలెక్టర్ బి.ఎం సంతోష్

నామినేషన్ల సంఖ్య..

బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి(Deepak Reddy) భార్య హరిత రెడ్డి(Haritha Reddy) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో, ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో నామినేషన్ల సంఖ్య 127కు చేరగా, అభ్యర్థుల సంఖ్య 94కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. ఈ సంఖ్య మంగళవారం మరింత పెరిగే అవకాశముంది. 21న నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత, అక్టోబర్ 22న పరిశీలన జరగనుంది.

Also Read: Samantha: వ్యక్తిగత జీవితంపై సమంత వైరల్ కామెంట్స్.. ఆ ట్రోలింగ్ వల్లే..

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?