Kavitha - KTR( image CREDIT: twitter)
Politics, లేటెస్ట్ న్యూస్

Kavitha – KTR: కేటీఆర్‌ దెయ్యాల జాబితాలో లేరంటూ కవిత స్పష్టీకరణ

Kavitha – KTR: కేసీఆర్(KTR) కుటుంబంలో చెలరేగిన చిచ్చు రాఖీ పండుగతో ముగుస్తుందని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్(Brs) కార్యకర్తలు, కేసీఆర్( KCR) అభిమానుల ఆశలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) చిదిమేశారు. చాలాకాలంగా కేటీఆర్,(KRT) కవిత(Kavitha)  మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నదని రాష్ట్రవ్యాప్తంగా చర్చ ఉన్నది. సొంత క్యాడర్ కూడా దీన్ని నమ్ముతున్నది. అయితే, కేటీఆర్‌‌తో తనకు ఎలాంటి పంచాయితీ లేదని తాను చెప్పిన దెయ్యాల జాబితాలో ఆయన లేనే లేరని కవిత ఇటీవల ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.

 Also Read: Jagga Reddy: కేసీఆర్ ఫ్యామిలీ దొంగల ముఠా.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

కొన్నాళ్ల క్రితం ఇచ్చిన మరో ఇంటర్వ్యూలోనూ దాదాపు ఇలాంటి క్లారిటీనే ఇచ్చారు.  రాఖీ పండుగ ఉండడంతో తాను ఇంటికి వెళ్లి రాఖీ కడుతానని ముందే సమాచారం ఇచ్చారు. ఆ మెసేజ్‌కు రిప్లై ఇవ్వని కేటీఆర్(KTR) అప్పటికప్పుడే టికెట్ బుక్ చేసుకొని బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు. రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు రాఖీ కడుతానని ముందే సమాచారం ఇచ్చినా కేటీఆర్ ముఖం చాటేసి బెంగళూరుకు, అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ కంగుతిన్నది. పార్టీలో అన్నీ సర్దుబాటు అవుతాయని అనుకుంటున్న తరుణంలో కేటీఆర్ అహంకారంతో వ్యవహరించడం సరికాదని కొందరు మండిపడుతున్నారు. కవిత మమకారంతో రాఖీ కడుతానని చెప్తే తలబిరుసుగా వ్యవహరించడం మొత్తం పార్టీకే తలవంపులు తెస్తున్నదని వాపోతున్నారట.

కలహాల కుటుంబం

గత కొంతకాలంగా కేసీఆర్(KTR)  కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆస్తి పంపకాల తేడాలతో కేటీఆర్, కవిత(Kavitha) మధ్య పంచాయతీ నడుస్తున్నదని విస్తృత ప్రచారం జరుగుతున్నది. దీంతోనే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడడం లేదని, కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌(Kcr)కు నోటీసులు ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపట్టలేదని కవిత మండిపడ్డారు. ఆమెనే స్వయంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీలోని కొన్ని లోపాలను బహిరంగంగానే ఎత్తి చూపారు. అంతకుముందు పార్టీలోని లోపాలను కవిత ఎత్తి చూపుతూ తండ్రికి రాసిన లేఖ బయటకు రావడం సంచలనం అయింది. సోషల్ మీడియాలో ట్రోల్స్, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసినా బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంతో ఇప్పటికే ఆమె తీవ్ర అసహనంతో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనోవేదనకు గురైన సంఘటనలు ఉన్నాయని అనుచరులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కవిత జాగృతి సంస్థ తరఫున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

కేసీఆర్ మౌనం.. కానీ..

కవిత(KAVITHA) విషయంలో ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ పార్టీలోని ఇద్దరు ముగ్గురు నేతలు పరోక్షంగా ఆమెపై విమర్శలు చేశారు. దీనిపై కవిత(Kavitha) సైతం తీవ్రంగా స్పందించారు. వారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన విషయంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు అనుభవించిన వారు మాట్లాడే ముందు చూసుకోవాలని హితవు పలికారు. ఈ తరుణంలో రాఖీ పౌర్ణమితో కుటుంబ సమస్యలకు చెక్ పడుతుందని భావించిన క్యాడర్‌కు నిరాశ మిగిలింది. ఇంకా ఈ సమస్య ఎటు దారి తీస్తుందోనని పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఇది హాట్ టాపిక్ అయింది.

 Also Read: Doctor Post Vacancies: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గుడ్‌న్యూస్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం