Telangana BJP: ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది
Telangana BJP (imagecredit:twitter)
Political News, Technology News

Telangana BJP: ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది.. ఇక చాలు ఆపేద్దాం అంటున్న బీజేపీ నేతలు

Telangana BJP: టీబీజేపీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ తీరు అస్తవ్యస్తంగా మారింది. ఎవరికి నచ్చిన కామెంట్స్ వారు చేస్తూ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. పలువురు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గతంలో కంటే ఈసారి 8 వేలకు పైగా ఓట్లు తగ్గడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఓటమి బీజేపీ నేతలకు గుణపాఠంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఓటమి నుంచి తేరుకుని నేతల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా నార్సింగ్ లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) ఇంట్లో టీబీజేపీ ఎంపీ(MP)లు, ఎమ్మెల్యేలు(MLA), ఎమ్మెల్సీ(MLC)లతో లంచ్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్​మణ్(MP Laxman), రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి సైతం హాజరయ్యారు. కాగా సర్పంచ్, జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లో పార్టీ సత్తాచాటాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే అంతా కలిసి కట్టుకట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇక చాలు..

తెలంగాణ బీజేపీలో ఎంపీలు, ఎమ్మెల్యేల్లో పలువురికి ఒకరంటే ఒకరు పడని పరిస్థితి ఉంది. ఉన్న కొద్దిమందిలోనే ఈ పరిస్థితి ఉంటే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కష్టమని చర్చలోకి వచ్చినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్​యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. విజయతీరాలకు చేరుకోవాలంటే తమలో తమకు పంచాయితీలు ఉండవద్దని భావించినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని, ఇకనైనా అందరూ కలిస్తేనే ముందుకు వెళ్లొచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్. లోకల్ బాడీ(Local Body), జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లో గెలవాల్సిందేనని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే హెచ్ఐఎల్ టీ(HILT) పాలసీ ద్వారా రూ.6.29 లక్షల కోట్ల భూములను రూ.5 వేల కోట్లకే ధారాధత్తం చేయడాన్ని అడ్డుకోవాలని, 27 మున్సిపాలిటీల విలీనంపై పోరాడాలని నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: Karnataka CM Change: కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు.. రేపు సీఎం సిద్ధూ, డీకే భేటీ.. ఏం జరగబోతోంది?

ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్

ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అర్వింద్(MP Arvind) చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తాను ప్రచారానికి రాలేదని హైకమాండ్ కు ఫిర్యాదు చేయొద్దని రాంచందర్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను అక్కడ ప్రచారంలో పాల్గొన్న వారికంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేస్తున్నానని సర్దిచెప్పుకున్నారు. కాగా ఈ మీటింగ్ లో ఇరువురి పంచాయితీకి చెక్ పెట్టారనే చర్చ కూడా జరుగుతోంది. ఇద్దరి మధ్య పంచాయితీని లక్ష్మణ్ కొలిక్కి తెచ్చినట్టుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం తెలంగాణకు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(BL Santhosh) హైదరాబాద్(Hyderabad) కు రానున్న నేపథ్యంలో ఈ మీటింగ్ ను సక్సెస్ చేయడంపై చర్చించినట్లుగా కూడా పలువురు చెబుతున్నారు.

నేడు తెలంగాణకు బీఎల్ సంతోష్

బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలతో నగర శివారులో విస్కృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు చీఫ్ గెస్టుగా బీఎల్ సంతోష్ హాజరవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన తొలిసారి రాష్ట్రానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్పంచ్ ఎన్నికలతో పాటు, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read: Yuva Sarpanch: నామినేషన్ రెండో రోజే ఎన్నిక ఏకగ్రీవం.. సర్పంచ్‌గా 24 ఏళ్ల కుర్రాడు

Just In

01

C-Mitra: సత్ఫలితాలిస్తోన్న ‘సీ-మిత్ర’.. 10 రోజుల్లో 1000 కాల్స్.. 100 ఎఫ్ఐఆర్‌లు నమోదు

Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?

Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. దయచేసి విమర్శలు చేయకండి

DGP Office Scandal: డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వైరలవుతున్న వీడియో.. సీఎం సీరియస్!

Crorepati Beggar: రోడ్డుపై భిక్షాటన భిక్షగాడికి 3 ఇళ్లు, 3 ఆటోలు, ఒక కారు.. నివ్వెరపోతున్న జనాలు!